వేగం పెంచిన నేచురల్ స్టార్.. ముగింపులోపు 3 సినిమాలు!

Thu Jun 24 2021 05:00:01 GMT+0530 (IST)

Nani Upcoming Movie Updates

టాలీవుడ్ ఇండస్ట్రీలో వేగంగా సినిమాలు పూర్తి చేసి వరుసగా విడుదలకు సిద్ధం చేసే హీరో నేచురల్ స్టార్ నాని. ప్రతి ఏడాది ఒక సినిమా రిలీజ్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు హీరోలు. కానీ నాని మాత్రం మినిమం రెండు సినిమాలైనా రిలీజ్ చేస్తుంటాడు. కొన్నేళ్లుగా నాని నుండి ఇదే జరుగుతుంది. ఎందుకంటే తక్కువ టైంలో ఎక్కువ సినిమాలు చేసేస్తుంటాడు. అలాగే ఎల్లప్పుడూ చేతినిండా సినిమాలు లైనప్ చేసి పెట్టుకుంటాడు. ఆల్రెడీ ఈ ఏడాదికి మూడు సినిమాలు రెడీ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే నాని 'టక్ జగదీష్' సినిమాను విడుదలకు సిద్ధం చేసాడు.క్లాస్ మాస్ అంశాలతో ఈ సినిమా భారీ అంచనాలు సెట్ చేసుకుంది. ఆల్రెడీ సినిమాకు సంబంధించి సాంగ్స్.. టీజర్ కూడా మంచి బజ్ క్రియేట్ చేసాయి. ఇంతకాలం కరోనా కారణంగా విడుదలకు బ్రేక్ పడటంతో సినిమాను ఆగస్టులో రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. 'టక్ జగదీష్' డైరెక్టర్ శివ నిర్వాణ - నాని కాంబినేషన్ సెకండ్ మూవీ. అయితే నాని తదుపరి సినిమా పీరియడిక్ సినిమా చేస్తున్నాడు. శ్యామ్ సింగరాయ్ పేరుతో ఈ సినిమాలో నాని డిఫరెంట్ రోల్స్ లో అలరించనున్నాడు. ప్రస్తుతం సినిమా షూటింగ్ దశలో ఉంది.

ఇదిగాక నాని మరో సినిమా కూడా షూటింగ్ ప్రారంభం కాబోతుంది. నాని 'అంటే సుందరానికి' అనే సినిమాను ఓకే చేసాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో పూర్తి వినోదంతో సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాను తక్కువ రోజుల్లో అంటే కేవలం రెండు నెలల్లో పూర్తి చేయాలనీ ఫిక్స్ అయినట్టు టాక్. ఈ సినిమాను నానితో గ్యాంగ్ లీడర్ నిర్మించిన మైత్రి మూవీస్ వారే నిర్మిస్తున్నారు. ఆగష్టులో సినిమా మొదలవుతుందని సమాచారం. ఈ విధంగా నాని ప్రస్తుతం మూడు సినిమాలు శరవేగంగా కంప్లీట్ చేసి ఈ ఏడాది ఎండింగ్ వరకు రిలీజ్ చేయనున్నాడట. ఇవేగాక నాని ఇటీవలే డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ తో ఓ సినిమా ఓకే చేసాడు. సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో ఆ సినిమా త్వరలో పట్టాలెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తానికి వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లోపు ఈ నాలుగు సినిమాలను నాని ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తున్నట్లు సినీవర్గాలు చెబుతున్నాయి.