Begin typing your search above and press return to search.

డిసెంబ‌ర్ నుంచి శ్యాం సింఘ‌రాయ్ సెట్స్ పైకి

By:  Tupaki Desk   |   25 Oct 2020 8:50 AM GMT
డిసెంబ‌ర్ నుంచి శ్యాం సింఘ‌రాయ్ సెట్స్ పైకి
X
ప్ర‌భాస్ .. మ‌హేష్ .. ప‌వ‌న్ ఇలా అగ్ర హీరోల‌కు జాతీయ ఫిలింక్రిటిక్ కం అన‌లిస్ట్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్ చేసే ప్ర‌చారం గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. నిరంత‌రం వీళ్ల సినిమాలేవి రిలీజైనా వాటిని ట్వీట్ చేస్తుంటారు. ఇంత‌కుముందు ప్ర‌భాస్ సాహోకి సంబంధించిన ప్ర‌తిదీ ఆయ‌న హైలైట్ చేసారు.

ఇక ఆయ‌న ప్ర‌మోట్ చేసే హీరోల్లో అక్కినేని అఖిల్ నాగ‌చైత‌న్య‌ ప్ర‌ముఖంగా ఉంటార‌న్న సంగ‌తి తెలిసిందే. అఖిల్ గ‌త చిత్రాల‌కు మాదిరిగానే ఈరోజు విడుద‌లైన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ పోస్ట‌ర్ ని ప్ర‌మోట్ చేశారు. అలాగే నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా న‌టిస్తున్న శ్యామ్ సింఘ‌రాయ్ పోస్ట‌ర్ ని త‌ర‌ణ్ ఆద‌ర్శ్ ట్విట్ట‌ర్ లో షేర్ చేశారు.

నాని - సాయిప‌ల్ల‌వి- కృతి శెట్టి ప్ర‌ధాన తారాగ‌ణం‌గా టాక్సీవాలా ఫేం రాహుల్ సంకృత్యాయ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ తెర‌కెక్క‌నుంది. వెంక‌ట్ బోయ‌న‌ప‌ల్లి నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయ‌ర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మ‌హమ్మారీ వ‌ల్ల చిత్రీక‌ర‌ణ అంత‌కంత‌కు ఆల‌స్య‌మైంది. ఈ ఏడాది డిసెంబ‌ర్ నుంచి చిత్రీక‌ర‌ణ ప్రారంభం కానుంది. ద‌స‌రా సంద‌ర్భంగా సింఘ‌రాయ్ టీమ్ శుభాకాంక్ష‌లు తెలిపింది. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ నాని అభిమానుల్లో వైర‌ల్ గా మారింది. నాని ఈ మూవీ కోసం పూర్తిగా మేకోవ‌ర్ అయ్యారు. అలాగే ఇంత‌కుముందు నాని బ‌ర్త్ డే సంద‌ర్భంగా రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ అభిమానుల్లో జోరుగా వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే.