Begin typing your search above and press return to search.

నాని పీరియాడిక్ మూవీ పూర్తి కల్పితమేనట!

By:  Tupaki Desk   |   1 March 2021 7:30 AM GMT
నాని పీరియాడిక్ మూవీ పూర్తి కల్పితమేనట!
X
టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని కథానాయకుడుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా శ్యామ్ సింగరాయ్. ఇటీవలే నాని పుట్టినరోజు సందర్బంగా మేకర్స్ శ్యామ్ సింగరాయ్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ సినీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుందని చెప్పాలి. ఎందుకంటే నాని ఫస్ట్ టైం ఓ పీరియడిక్ క్యారెక్టర్ చేస్తున్నాడు. లుక్ చూస్తే అప్పటి నేటివిటిని పక్కా ప్రణాళికతో సెట్ చేసినట్లుగా అర్ధమవుతుంది. ఆ కాలంనాటి డ్రెస్సింగ్ స్టైల్, మీసకట్టు.. ప్యాంటు షర్టు.. ఇలా అన్నివిధాలా నాని బెంగాలీ యువకుడిగా అభిమానులకు ట్రీట్ ఇచ్చాడు. అయితే ఈ సినిమా అప్పటి 1960-70 కాలం నేపథ్యంలో తెరకేక్కుతుందని పోస్టర్ పోస్టర్ చూస్తే తెలుస్తుంది.

అయితే ఈ సినిమా కథ పూర్తిగా కల్పితమేనట. అసలు ఏ వ్యక్తి కథను గాని, ఇన్సిడెంట్స్ గాని స్ఫూర్తిగా తీసుకోలేదని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాలో నాని ద్విపాత్రభినయం చేయనున్నాడు. పునర్జన్మల నేపథ్యంలో రూపొందుతుంది కాబట్టి ఈ సినిమా గురించి ప్రతి విషయంలో కేర్ తీసుకుంటున్నారు దర్శకనిర్మాతలు.

ప్రస్తుతం కలకత్తాలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో సాయిపల్లవి ప్రధాన హీరోయిన్ గా నటిస్తోంది. నాని పై మనసు పడిన క్యారెక్టర్లో సాయిపల్లవి కనిపించనుందట. ఆమె బెంగాలీ పార్ట్ లో కనిపిస్తుందని టాక్. అలాగే కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్ లు కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే కృతిశెట్టి తన పార్ట్ షూట్ కంప్లీట్ చేసుకుందట. నాని కెరీర్ లోనే శ్యామ్ సింగరాయ్ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తుండగా.. వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు.