మరోసారి అదే చేస్తున్న నాని!

Thu Jan 23 2020 07:00:02 GMT+0530 (IST)

Nani On about his Upcoming movie

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం సీనియర్ డైరెక్టర్స్ కంటే అప్ కమింగ్ డైరెక్టర్స్ కే డేట్స్ ఇస్తూ సినిమాలు చేస్తున్నాడు. ఒకే ఒక్క సినిమా చేసిన గౌతం కి చాన్స్ ఇచ్చి జెర్సీ చేసిన నాని అదే రీతిలో రెండు సినిమాలు తీసిన కుర్ర దర్శకుడికి కమిట్ మెంట్ ఇచ్చాడు. ప్రస్తుతం 'V' సినిమాను ఫినిష్ చేసిన నాని త్వరలోనే శివ నిర్వాణ 'టక్ జగదీష్' ను స్టార్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసే ప్లాన్ లో ఉన్నాడు. ఎమోషనల్ లవ్ స్టోరీ గా రూపొందనున్న ఈ సినిమాలో ఇంకా హీరోయిన్ ఫైనల్ అవ్వలేదు.ఈ గ్యాప్ లో 'టాక్సీ వాలా' డైరెక్టర్ కి చాన్స్ ఇచ్చాడు నాని. అవును రాహుల్ సంక్రిత్యన్ తో నెక్స్ట్ సినిమాను చేయడానికి సిద్దమవుతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమా 'టక్ జగదీశ్' అవ్వగానే మొదలు పెట్టేలా ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాను 'జెర్సీ' నిర్మించిన సితార బ్యానర్ లోనే చేయబోతున్నాడు.

అయితే రాహుల్ ఇప్పటి వరకూ చేసిన రెండు సినిమాలు హారర్ జోనర్ లోనే  తెరకెక్కాయి. కానీ ఈసారి నానితో ఓ రొమాంటిక్ డ్రామా సినిమా చేస్తాడని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.