టక్ జగదీష్ నాని ప్రతిభకు పరీక్ష

Sun Aug 09 2020 23:00:01 GMT+0530 (IST)

Nani On about Tuck Jagadish Movie

నాని శివ నిర్వానల కాంబోలో వచ్చిన ‘నిన్నుకోరి’ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఫెయిల్యూర్ లవ్ స్టోరీని చాలా విభిన్నంగా చూపించిన దర్శకుడు విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు కమర్షియల్ గా మంచి సక్సెస్ దక్కించుకుంది. ఇక నాని ఈ చిత్రంలో మరోసారి అద్బుతమైన నటనతో ఆమెప్పించాడు. ప్రేమ విఫలం అయిన ఒక యువకుడి పాత్రలో ఆయన నటన విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఇప్పుడు మరోసారి నాని ప్రతిభకు దర్శకుడు శివ నిర్వాన పరీక్ష పెడుతున్నట్లుగా తెలుస్తోంది.వీరిద్దరి కాంబోలో ఇప్పటికే ‘టక్ జగదీష్’ చిత్రం ప్రారంభం అయ్యింది. ఆ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. తాజాగా ఈ సినిమాలో నాని ఒక మానసిక సమస్యతో బాధపడుతూ ఉంటాడని ఆ పాత్రకు సంబంధించి చాలా వేరియేషన్స్ ఉంటాయట. ఆ వేరియేషన్స్ చూపించడం మామూలు విషయం కాదు. కొన్ని సెకన్ల వ్యవధిలో మూడ్ మారడం కూడా ఈ సినిమాలో చూడవచ్చు.

సహజ నటుడిగా పేరున్న నానికి ఈ సినిమాలోని జగదీష్ పాత్ర ఒక ఛాలెంజ్ గా మారిందట. ఈ సినిమా విడుదల అయిన తర్వాత నాని నటుడిగా మరో స్టెప్ ఎక్కినట్లే అంటున్నారు. కరోనా కారణంగా ఆగిపోయిన షూటింగ్ ను అక్టోబర్ లేదా నవంబర్ లో ప్రారంభించాలని భావిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయంటున్నారు.

ఈ చిత్రంలో నానికి జోడీగా ఐశ్వర్య రాజేష్ మరియు రీతూ వర్మలు నటిస్తున్నారు. శివ నిర్వాన గత చిత్రాల్లో ఇద్దరు హీరోయిన్స్ నటించారు. ఆ సినిమాలు హిట్ అయ్యాయి. పక్కాగా ఈ సినిమా కూడా హిట్ అవుతుందని నాని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.