నాని సినిమాకు క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చేశారు

Mon Apr 15 2019 18:05:30 GMT+0530 (IST)

Nani Jersey Movie Gets Clean U Certificate

ఈ శుక్రవారం విడుదల కానున్న న్యాచురల్ స్టార్ నాని జెర్సీ సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. సభ్యులు క్లీన్ యు ఇచ్చేశారు. ట్రైలర్ చూసినప్పుడే ఇది వస్తుందని సినిమా జనాలు ఊహించారు. దానికి తగ్గట్టే జెర్సీ సర్టిఫికేట్ అందుకుంది. జీవితం తొలిదశలో క్రికెటర్ గా ఓడిపోయి కొడుకు కోసం మళ్ళి బ్యాట్ పట్టుకుని ప్రపంచానికి తానేంటో రుజువు చేసిన ఓ యువకుడి కథే జెర్సీ.ట్రైలర్ లో మెయిన్ లైన్ ని స్పష్టంగా చూపించేయడంతో అందరికి పూర్తి క్లారిటీ ఉంది. స్క్రీన్ మీద గౌతం తిన్ననూరి వీటిని ఎలా ఆవిష్కరించి ఉంటాడు అనే దాని మీదే ఫలితం ఆధారపడి ఉంటుంది. ఇందులో ఎలాంటి మసాలా అంశాలు కాని వయోలెన్స్ కాని లేకపోవడంతో క్లీన్ యు అందుకుంది. హీరో హీరొయిన్ మధ్య లవ్ ట్రాక్ ఉన్నా అందులో గ్లామర్ కు చోటు ఇవ్వలేదు దర్శకుడు.

సో ఇప్పుడీ స్పోర్ట్స్ డ్రామాకు జనం నుంచి ఎలాంటి స్పందన దక్కుతుందో చూడాలి. నాని అయితే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ అని చెబుతున్నాడు. అనిరుద్ రవిచందర్ సంగీతం అందించిన జెర్సీ ద్వారా హీరొయిన్ గా శ్రద్ధా శ్రీనాద్ పరిచయమవుతోంది. మల్టీ టాలెంటెడ్ యాక్ట్రెస్ గా గుర్తింపు ఉన్న శ్రద్ధా జెర్సీకి మరో ప్రధాన ఆకర్షణగా టీం చెబుతోంది.

పోటీ లేకుండా సోలోగా బరిలో దిగుతున్న జెర్సీ హిట్ కావడం నానికి చాలా అవసరం. గత ఏడాది రెండు పరాజయాలు దక్కిన నేపధ్యంలో ఇది మాములు హిట్ అయితే సరిపోదు. ఇప్పటికే హైదరాబాద్ లాంటి కీలక కేంద్రాల్లో ఆన్ లైన్ అడ్వాన్సు బుకింగ్ మొదలైపోయింది