జెర్సీ కలెక్షన్స్ కు అవే అడ్డు పడ్డాయి

Sat Apr 20 2019 15:18:28 GMT+0530 (IST)

Nani Jersey Movie First Day Collections

న్యాచురల్ స్టార్ నాని జెర్సీ ప్రమోషన్ టైంలో ఎందుకంత కాన్ఫిడెంట్ గా కనిపించాడో జనానికి ఇప్పుడు అర్థమవుతోంది. తన ఇమేజ్ పరంగా ఇలాంటి పాత్రలు రిస్క్ అయినప్పటికీ ధైర్యం చేసి ఒప్పుకున్నందుకు నానిని మెచ్చుకోవాల్సిందే. నిన్న ఉదయం షోకి డీసెంట్ గా ఓపెన్ అయిన జెర్సీ సాయంత్రానికి సీన్ మొత్తం మార్చేసింది. అనూహ్యంగా బుకింగ్స్ మొత్తం ఫుల్ అవ్వడం మొదలయ్యింది.తెలుగు రాష్ట్రాల వరకు మొదటి రోజు 4.5 కోట్ల షేర్ వచ్చిందని ట్రేడ్ టాక్. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 5.5 లేదా 6 కోట్ల మధ్యలో ఉండొచ్చని చెబుతున్నారు. ఇంకా పూర్తి రిపోర్ట్స్ రావలసి ఉంది. ఇంత టాక్ వచ్చినా ఇది కృష్ణార్జున యుద్ధం(5.6 కోట్లు)-దేవదాస్(7 కోట్లు)కంటే తక్కువ కావడం గమనార్హం దానికి చాలా స్పష్టమైన కారణాలు ఉన్నాయి.

బయటికి కనిపించకపోయినా లారెన్స్ కాంచన 3 నిన్న ఎఫెక్ట్ చూపించింది. బిసి సెంటర్స్ లో జనం దీనికే పోటెత్తారు. టాక్ తో సంబంధం లేకుండా ఏదో ఎంటర్ టైన్మెంట్ ఉంటుందనే నమ్మకంతో హౌస్ ఫుల్స్ చేశారు. ఇది ప్రభావం చూపించే అంశమే. దానికి తోడు గత నాని రెండు సినిమాల ఫలితాలు కూడా ఇక్కడ రోల్ ప్లే చేశాయి. ఎంత క్రికెట్ యునివర్సల్ గేమ్ అయినప్పటికీ మాస్  అంత ఈజీగా కనెక్ట్ కారు. అందుకే ఫస్ట్ స్లోగా ఓపెన్ అయ్యింది. ఇప్పుడు టాక్ తో పాటు క్లియర్ రిపోర్ట్స్ వచ్చేశాయి కాబట్టి ఫిగర్స్ లో మార్పు ఉండటం మొదలవుతుంది.