ట్రైలర్ టాక్: ఎవరైనా పులిహోర తింటారా?

Thu Sep 12 2019 21:41:09 GMT+0530 (IST)

Nani Gang Leader Movie Latest Trailer

 న్యాచురల్ స్టార్ నాని - విక్రమ్ కుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'గ్యాంగ్ లీడర్'. శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఇప్పటికే టీజర్ ట్రైలర్లు.. లిరికల్ సాంగ్స్ అన్నీ రిలీజ్ చేశారు కానీ కౌంట్ డౌన్ గంటల్లోకి వచ్చిన సమయంలో సినిమాపై మరింత బజ్ పెంచేందుకు మరో షార్ట్ ట్రైలర్ రిలీజ్ చేశారు.జస్ట్ హాఫ్ మినిట్ మాత్రమే ఉన్న ఈ ట్రైలర్ ఒక ఒకే ఒక సీన్ ఉంది. జోరుగా కురుస్తున్న వానలో ఒక పాత మోడల్ కారులో నాని.. ఇతర గ్యాంగ్ మెంబర్స్ ఉంటారు.  డ్రైవింగ్ సీట్ లో కూర్చుని ఉన్న నాని గంభీరమైన గాత్రంతో ఒక సీరియస్ డైలాగ్ చెప్తుంటాడు. అసలే రివెంజ్ కోసం ఎదురు చూస్తున్న గ్యాంగ్. కానీ ఆ డైలాగ్ ఎంత ఎమోషన్ లో చెప్పినా అదేమీ పట్టించుకోని గ్యాంగ్ మెంబెర్స్ గుర్రుపెట్టి నిద్రపోతుంటారు. దీంతో ఆ సీరియస్ నెస్ కాస్తా సిట్యుయేషనల్ కామెడీగా మారిపోతుంది. ఆ గ్యాంగ్ లో ఒక మెంబర్ అయిన శరణ్య నిద్రలేచిన వెంటనే "ఎవరైనా పులిహోర తింటారా?" అని అడుగుతుంది.  ఈ దెబ్బకు షాక్ తిన్న నాని "మీతో నావల్ల కాదు..మీతో నావల్ల కాదు" అంటూ చిరాకు పడుతూ స్టీరింగ్ పై చెయ్యి వేస్తాడు.

ఇలాంటి ఇలాంటి పులిహోర గ్యాంగ్ తో పెన్సిల్ ఎలా రివెంజ్ ప్లాన్ చేశాడు..అసలు వారు అనుకున్న మిషన్ పూర్తి చేయగలిగాడా లేదా అనేది నిజంగానే ఆసక్తికరం. ఆలస్యం ఎందుకు పెన్సిల్ గారి గ్యాంగ్ ను.. వారి సీరియస్ సిట్యుయేషనల్ కామెడీని ఒకసారి మీరూ సీరియస్ గా చూసేయండి.