Begin typing your search above and press return to search.

చేతులు మారుతున్న నాని దసరా

By:  Tupaki Desk   |   2 Feb 2023 9:00 PM GMT
చేతులు మారుతున్న నాని దసరా
X
న్యాచురల్ స్టార్ నాని హీరోగా కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా దసరా. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ రీసెంట్ గా విడుదలై సంచలనంగా మారింది. నాని కెరియర్ లో మొదటిసారిగా పవర్ ఫుల్ మాస్ పాత్రలో ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. పుష్పాలో అల్లు అర్జున్ ఈ తరహా పాత్రలో అయితే నటించాడు. ఇంచుమించుగా అలాంటి క్యారెక్టర్ లోని దసరా సినిమాలో నాని కూడా కనిపించబోతూ ఉండడం విశేషం.

ఈ సినిమాలో నానికి జోడిగా కీర్తి సురేష్ కీలక పాత్రలో నటించింది. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ నడవనుంది. ఇప్పటికే నిర్మాత దిల్ రాజు ఈ సినిమా థియేటర్ రైట్స్ సొంతం చేసుకున్నాడు. భారీ ధరకు ఈ సినిమా రైట్స్ ని డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు సొంతం చేసుకోవడం విశేషం. నిజానికి ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను ముందుగా చదలవాడ సొంతం చేసుకోగా. అతనికి నాలుగు కోట్లు అదనంగా ఇచ్చి దిల్ రాజు మరల తీసుకున్నాడు.

అయితే ఇప్పుడు దిల్ రాజు నుంచి ఏరియా లవారిక హక్కులను డిస్ట్రిబ్యూటర్స్ కొనుక్కోవడానికి పోటీపడుతున్నట్లుగా తెలుస్తుంది. కేవలం టీజర్ తోనే ఈ సినిమా బిజినెస్ భారీగా పెరిగినట్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట.

ఈ రకమైన కథలతో వచ్చిన రంగస్థలం, పుష్ప సినిమాలు ఇప్పటికే ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ గా నిలుచుండడంతో నాని దసరా సినిమాకి కూడా హై ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. ఈ నేపథ్యంలోనే సినిమా బిజినెస్ కూడా అమాంతం పెరిగిపోయినట్లుగా తెలుస్తుంది.

నాని కెరియర్లో పాన్ ఇండియా ఇమేజ్ తీసుకొచ్చే సినిమాగా దసరా నిలవబోతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని టాలీవుడ్ విశ్లేషకులు చెబుతున్నారు. మరి భారీ అంచనాల మధ్య మార్చి 30న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఏ స్థాయి సంచలనాలు టాలీవుడ్ లో సృష్టిస్తుంది అనేది వేచి చూడాలి.

ఇండస్ట్రీలో హిట్టు పడితే మాత్రం పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీ సూపర్ కలెక్షన్స్ తో దూసుకుపోవడం పక్కా అనే మాట వినిపిస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.