Begin typing your search above and press return to search.

నాని దసరా.. అసలైన అగ్నిపరీక్ష..!

By:  Tupaki Desk   |   29 Jan 2023 11:00 AM GMT
నాని దసరా.. అసలైన అగ్నిపరీక్ష..!
X
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం చేస్తున్న దసరా సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు. తన కెరీర్ లోనే ఫస్ట్ టైం ఫుల్ లెంగ్త్ మాస్ క్యారెక్టర్ తో మెప్పించాలని చూస్తున్నాడు నాని. శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు ఈ సినిమా చేస్తున్నారు. మార్చి 30 రిలీజ్ ఫిక్స్ చేసుకున్న ఈ దసరా సినిమా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేశారు. నేషనల్ లెవెల్ లో ఆడియన్స్ ని అలరించాలంటే సినిమాలో తగినంత స్టఫ్ ఉండాల్సిందే. అది తన సినిమాలో కావాల్సినంత ఉంది అని నాని చెబుతున్నాడు.

నాని మార్క్ ఎంటర్టైనర్ మాత్రమే కాదు ఈసారి ఊర మాస్ కథతో నాని వస్తున్నాడట. దసరా సినిమా నానికి అసలు సిసలైన అగ్ని పరీక్ష అని చెప్పొచ్చు. ఈ సినిమాతో తను కూడా మాస్ హీరోగా ప్రమోట్ అవ్వాలని చూస్తున్నాడు నాని.

తనకు ఇచ్చిన నేచురల్ స్టార్ స్క్రీన్ నేం కి న్యాయం చేస్తున్నా ఎక్కడో ఒక చోట తను ఇంకా టైర్ 2 హీరోల లానే పరిగణించబడుతున్నాడు. అందుకే ఈసారి దసరాతో తన రేంజ్ పెంచుకోవాలని ఫిక్స్ అయ్యాడు నాని. అందుకే దసరా సినిమా ప్రతీ విషయంలో నాని ఇన్వాల్వ్ మెంట్ ఉంటుంది.

ఇక ఈ నెల 30న సినిమా నుంచి టీజర్ రాబోతుంది. ఆల్రెడీ ధూం ధాం సాంగ్ తో సినిమాపై ఓ ఇంప్యాక్ట్ క్రియేట్ చేసిన నాని టీజర్ తో సినిమా గురించి శాంపిల్ చూపించబోతున్నారు.

టీజర్ అనౌన్స్ మెంట్ వీడియో కూడా అదుర్స్ అనిపించింది. నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నాని కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో వస్తుంది. నాని ఊర మాస్ యాటిట్యూడ్ సినిమాకు హైలెట్ గా నిలుస్తుంది అంటున్నారు. ఇప్పటివరకు నాని నటించిన ఏ సినిమాకు రానటువంటి బజ్ దసరాకి వస్తుంది.

అల్లు అర్జున్ పుష్ప తరహాలో మాస్ ఆడియన్స్ కి దసరా ఎక్కితే మాత్రం నాని అనుకున్న రేంజ్ కన్నా ఎక్కువే ఈ సినిమా రీచ్ అవుతుందని చెప్పొచ్చు. అందుకే సినిమా గురించి ఎలాంటి హింట్స్ ఇవ్వకుండా చాలా జాగ్రత్త వహిస్తున్నాడు నాని. మరి అంచనాలకు తగినట్టుగానే నాని దసరా దుమ్ముదులిపేస్తుందా లేదా అన్నది సినిమా వస్తేనే కానీ చెప్పలేం. సౌత్ సినిమాలకు బాలీవుడ్ లో సూపర్ క్రేజ్ రాగా నాని దసరానికి అక్కడ కూడా బాగానే ప్రమోట్ చేయాలని చూస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.