అంత సీనుందా ? నాని

Wed Sep 11 2019 23:00:02 GMT+0530 (IST)

Nani Confident on About Priyanka Arul Mohan For Gang Leader Movie

ఎప్పటికప్పుడు తన సినిమాతో కొత్త హీరోయిన్ ని ప్రేక్షకులకు పరిచయం చేయాలనుకుంటాడు నాని. తన సినిమాల ద్వారా ఇప్పటికే కొందరు హీరోయిన్స్ ను పరిచయం చేసిన నాని ఇప్పుడు తన 'నానీస్  గ్యాంగ్ లీడర్' ద్వారా ప్రియాంక అరుళ్ అనే అమ్మాయిని  హీరోయిన్ గా పరిచయం చేస్తున్నాడు. ఇక్కడే ఓ సమస్య ఉంది. నాని పరిచయం చేసిన హీరోయిన్స్ లో మెహ్రీన్ - నివేత థామస్ మినహా మిగతా వాళ్ళకి తెలుగులో ఛాన్స్ లు కూడా దక్కలేదు. జెర్సీ తో పరిచయమైన శ్రద్దా శ్రీనాథ్ కి కూడా ఇక్కడ పెద్దగా అవకాశాల్లేవ్. 'మజ్ను' తో హీరోయిన్ గా పరిచయమైన అను ఇమాన్యుయేల్అయితే ఇప్పుడు ప్రియాంక పరిస్తితేంటో.. అనే ప్రశ్న కు చెక్ పెట్టేసాడు నాని. ప్రియాంక ను గుర్తుపెట్టుకోండి గొప్ప హీరోయిన్ అవుతుంది. ఇక ముందు మీడియా తనని మళ్ళీ మళ్ళీ కలుస్తుంటుంది అంటూ ఎంతో కాన్ఫిడెంట్ గా చెప్పాడు. అయితే నిజంగానే ప్రియాంక కి అంతా సీన్ ఉందా..? అనే విషయం రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాతే తెలుస్తుంది.

నిజానికి నాని సినిమాల్లో హీరోయిన్ ని చాలా సందర్భాల్లో తన నటనతో డామినేట్ చేస్తుంటాడు. కానీ గ్యాంగ్ లీడర్ లో పెద్ద గ్యాంగ్ ఉంది. వారందరినీ దాటి ప్రియాంక తన పెర్ఫార్మెన్స్ తో నేట్టుకొట్టుస్తుందా..లేదా తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే. మరి ప్రియాంక ఈ సినిమా తర్వాత సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకుంటూ టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు అందుకోగలదా..?