Begin typing your search above and press return to search.

#Nani29 అప్డేట్: మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లో నేచురల్ స్టార్..!

By:  Tupaki Desk   |   13 Oct 2021 11:27 AM GMT
#Nani29 అప్డేట్: మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లో నేచురల్ స్టార్..!
X
నేచురల్ స్టార్ నాని కెరీర్ ప్రారంభం నుంచి విభిన్నమైన చిత్రాలు విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటూ.. తన సహజమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నారు. ఇటీవలే 'టక్ జగదీష్' చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీ విధానంలో రిలీజ్ చేసిన నాని.. మరో రెండు చిత్రాలను సెట్స్ మీదకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో లేటెస్టుగా నాని మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టారు.

నాని కెరీర్ లో 29వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన దసరా పండుగను పురస్కరించుకుని అక్టోబర్ 15న మధ్యాహ్నం గం 1.53 నిమిషాలకు రానుంది. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా #Nani29 అప్డేట్ పోస్టర్ రిలీజ్ చేశారు. బ్లాక్ థీమ్ లో ఓ పొగ రైలు ను ఇందులో చూడొచ్చు. ఈ నెల 15 నుంచి ఎస్ట్రాక్షన్ (వెలికితీత) ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఇది కూడా నాని కెరీర్ లో డిఫరెంట్ కాన్సెప్ట్ తో రాబోతున్న మూవీ అని అర్థం అవుతోంది.

#Nani29 చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు. ఎస్ఎల్వి సినిమాస్ సంస్థలో ప్రస్తుతం రానా దగ్గుబాటి తో 'విరాటపర్వం' - రవితేజ హీరోగా 'రామరావు ఆన్ డ్యూటీ' - శర్వానంద్ తో 'ఆడవాళ్లు మీకు జోహార్లు' వంటి సినిమాలు రూపొందుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు నాని తో సినిమా ప్లాన్ చేశారు. నాని 29వ చిత్రంతో ఓ డెబ్యూ డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం అవబోతున్నాడని టాక్ నడుస్తోంది. దసరా రోజున ఈ సినిమాకు సంబంధించిన అన్ని విషయాలు వెల్లడి కానున్నాయి.

కాగా, నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ''శ్యామ్ సింగ రాయ్'' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది కలకత్తా బ్యాక్ డ్రాప్ లో రూపొందే హై వోల్టేజ్ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అలానే నాని 'అంటే.. సుందరానికి' అనే కామెడీ ఎంటర్టైనర్ షూటింగ్ ప్రారంభించాడు. 'మెంటల్ మదిలో' 'బ్రోచేవారెవరురా' ఫేం వివేక్ ఆత్రేయ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తర్వాత #Nani29 షూటింగ్ స్టార్ట్ అవుతుంది.