బాలీవుడ్ ప్రయత్నాలు.. మరి గ్లామర్ సంగతేంటి..??

Thu Jun 24 2021 06:00:01 GMT+0530 (IST)

Nanditha Swatha Career In Dilemma

సౌత్ బ్యూటీ నందిత శ్వేతా.. టాలీవుడ్ ప్రేక్షకులకు బాగానే సుపరిచితం. 2016లో సూపర్ హిట్ అయినటువంటి 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' మూవీతో అమ్మడు తెలుగు చిత్రపరిశ్రమలో అరంగేట్రం చేసింది. డెబ్యూ మూవీనే మంచి హిట్ అవ్వడంతో నందితకు అవకాశాలు చాలానే వచ్చాయి. కానీ ఈ బ్యూటీ మాత్రం చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ పోతుంది. పేరుకు బెంగళూరు భామే అయినప్పటికి తెలుగు.. తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేసింది. 2008లో కన్నడ సినిమాతో కెరీర్ ప్రారంభించింది నందిత.తర్వాత 2012లో అట్టకత్తి మూవీతో తమిళంలో అడుగు పెట్టింది. తమిళంలో కూడా నందితకు ఫస్ట్ మూవీనే సూపర్ హిట్ అయింది. అదే ఊపులో వెనక్కి తిరిగి చూడకుండా తమిళంలో సినిమాలు చేసింది. అనంతరం 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమాతో టాలీవుడ్ సూపర్ హిట్ డెబ్యూ అందుకుంది. అయితే ఈ భామకు డెబ్యూ సినిమాలు సక్సెస్ అవుతున్నాయి కానీ మిగతావి కొంచం తేడా కొట్టేస్తున్నాయి. ఇప్పటికి కన్నడ తమిళం తెలుగు మూడు భాషల్లో అదే జరిగింది. డెబ్యూ బాగానే అవుతోంది కానీ తర్వాతే అసలు చిక్కు వచ్చిపడింది. ప్రస్తుతం ఐపీసీ376 - ఇదం పొరుల్ యావల్ అనే సినిమాలు చేస్తోంది.

ఇప్పటివరకు తెలుగులో బ్లఫ్ మాస్టర్ - అభినేత్రి-2 - కల్కి సినిమాలలో మెరిసింది. తెలుగులో చివరిగా కపటదారి సినిమా చేసింది. కానీ సినిమా కూడా నందితకు హిట్ ఇవ్వలేకపోయింది. కెరీర్ ప్రారంభమై పదేళ్లు దాటినా ఇండస్ట్రీలో నందిత ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇన్నేళ్లు అయినా అమ్మడికి సరైన సోలో హిట్ పడలేదు. అందులోను గ్లామర్ - స్కిన్ షో పరంగా హద్దులు పెట్టుకునే సరికి కమర్షియల్ సినిమాలు రావట్లేదు. అందుకే ప్రస్తుతం సౌత్ సినిమాలెవి లేకపోవడంతో మకాం బాంబేకు షిఫ్ట్ చేస్తోందని టాక్. బాలాజీ పిక్చర్స్ వారి సీరియల్స్ లేదా ఎక్సల్ ఎంటర్టైన్మెంట్స్ వారి వెబ్ సిరీస్ లలో నటించేందుకు ట్రయల్స్ వేస్తోందని సమాచారం. మరి సౌత్ లో అంటే గ్లామర్ షో చేయకుండా పోయింది. మరి బాలీవుడ్ అంటే ఖచ్చితంగా గ్లామర్ షోకు తెరలు తీయాల్సిందే. చూడాలి మరి ఎలాంటి కబురు వినిపిస్తుందో!