Begin typing your search above and press return to search.

సీన్ కోసం నిజంగానే నా చెంప వాయగొట్టాడు.. ఏడ్చేసా!

By:  Tupaki Desk   |   19 Jun 2021 3:30 AM GMT
సీన్ కోసం నిజంగానే నా చెంప వాయగొట్టాడు.. ఏడ్చేసా!
X
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే నటిగా ప్రూవ్ చేసుకుంటోంది మోడల్ - బిగ్ బాస్ బ్యూటీ నందిని రాయ్. ప్రస్తుతం చేతినిండా సినిమాలు - వెబ్ సిరీస్ లతో బిజీ అయిపోయింది. పదేళ్లుగా ఇండస్ట్రీలో నటిగా కంటిన్యూ అవుతున్న నందిని.. ఇప్పటివరకు హీరోయిన్ గా సెటిల్ కాలేకపోయింది. ప్రస్తుతం ఓ బిగ్ బ్రేక్ కోసం వెయిట్ చేస్తోంది. అయితే ఇటీవలే ఆహా కోసం 'ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్.. "ఐ.ఎన్.జి" అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ వెబ్ సిరీస్ జూన్ ఇటీవలే ఆహాలో స్ట్రీమింగ్ మొదలయింది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ పై అమ్మడు భారీ ఆశలే పెట్టుకుంది. ఇప్పటికే షూట్ అవుట్ ఎట్ ఆలేరు - మెట్రో కథలు వెబ్ సిరీస్ లలో నటించింది.

అయితే తాజాగా ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా నందిని.. షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని విషయాలు బయటపెట్టింది. కొన్నిసార్లు షూటింగ్ టైంలో ఎమోషనల్ సీన్స్ నేచురల్ గా రావాలంటే హీరో హీరోయిన్స్ చాలా తంటాలు పడుతుంటారు. ఆ మధ్య బాలీవుడ్ హీరోయిన్ పరిణితి చోప్రా ఓ సినిమాలో మురికిగా కనిపించే సన్నివేశం కోసం రెండు రోజులు స్నానం చేయకుండా ఉండిపోయిందట. ఆ విధంగా 'ఐ.ఎన్.జి' వెబ్ సిరీస్ లో ఓ సీన్ కోసం చెంపలు వాచిపోయేలా కొట్టించుకుందట నందిని రాయ్. ప్రియదర్శి.. నందిని రాయ్.. వికాస్ ప్రధానపాత్రలలో 'ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్' వెబ్ సిరీస్ 'ఆహా'లో రిలీజ్ అయింది.

నందిని మాట్లాడుతూ.. "ఓ సన్నివేశంలో నేను.. సహనటుడు వికాస్ ఒకరినొకరు కొట్టుకోవాలని చెప్పింది. సీన్ సహజంగా రావాలని దర్శకుడు చెప్పాడు. మొదటిసారి వికాస్ నా చెంపను లైట్ గా కొట్టాడు. కానీ ఆ సీన్ బాగా రాలేదు. దీంతో తామిద్దరం నిజంగానే చెంపలు వాచిపోయాలా కొట్టుకుందామని ఫిక్స్ అయిపోయి నిజంగానే కొట్టుకోవడంతో చెంపలు వాచిపోయాయి. అప్పుడు ఆ సీన్ నేచురల్ గా రావడం నిజంగానే మా కళ్ళలో కన్నీళ్లు రావడంతో సీన్ పండింది. అప్పుడు చెంపలు వాచాయని బ్రేక్ ఇచ్చాడు. ఆ వాపు తగ్గాక షూట్ కంటిన్యూ చేసాం" అంటూ చెప్పుకొచ్చింది అమ్మడు. ఈ వెబ్ సిరీస్ నందిని ఓ పల్లెటూరి అమ్మాయి క్యారెక్టర్ పోషించింది. కానీ బోల్డ్ సీన్స్ కూడా చాలానే ఉన్నట్లు తెలుస్తుంది. తాజాగా నందిని కోతికొమ్మచ్చి అనే సినిమాలో ఐటమ్ సాంగ్ లో ఆడిపాడింది. చూడాలి మరి బిగ్ బ్రేక్ దొరుకుతుందేమో!