ఇంటరెస్టింగ్ 'టైటిల్'తో నందమూరి హీరో..!

Mon May 03 2021 13:06:52 GMT+0530 (IST)

Nandamuri hero with interesting 'title' ..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ హీరోలు అందరూ కూడా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసినవారే. ఇప్పటికి హీరోలుగా నందమూరి వారసులు కంటిన్యూ అవుతున్నారు. ప్రస్తుతం నందమూరి బాలయ్య యంగ్ టైగర్ ఎన్టీఆర్ సక్సెస్ ఫుల్ హీరోలుగా కొనసాగుతున్నారు. కానీ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ మాత్రం కొన్నేళ్లుగా స్ట్రగుల్ అవుతూనే ఉన్నాడు. పటాస్ సినిమా తర్వాత 118 లాంటి హిట్ అందుకున్నాడు కళ్యాణ్ రామ్. ఆ హిట్ పడి కూడా రెండేళ్లు గడిచింది. గతేడాది ఎంతమంచివాడవురా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ ఆ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వలేదు.ప్రస్తుతం కళ్యాణ్ రామ్ చేతిలో సినిమాలు ఉన్నాయి. కానీ అన్ని కూడా షూటింగ్ దశలోనే ఉన్నాయి. ఇప్పుడు హిట్టు పడాల్సిందే అనే పరిస్థితి ఏర్పడింది. ఈ లాక్డౌన్ సమయంలో చాలా స్క్రిప్టులు విని పలు సినిమాలకు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తుంది. ఇప్పటికే పలు సినిమాలు లైన్ లో ఉన్నాయి. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ - రాజేంద్ర దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. స్టార్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీస్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో త్రిపాత్రభినయం చేయనున్నట్లు టాక్ నడుస్తుంది. కానీ ఈ తాజాగా ఈ సినిమా టైటిల్ గురించి ఓ వార్త వైరల్ అవుతోంది.

అదేంటంటే.. పూర్తి ఫన్ అండ్ యాక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీకి మేకర్స్ 'ఏమిగోస్' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. వినడానికి డిఫరెంట్ గా ఉంది కానీ సినిమాకు బాగా సూట్ అవుతుందని అనుకుంటున్నారట. మరి అసలు విషయం తెలియాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే. మరి ఈ సినిమాతో అయినా కళ్యాణ్ రామ్ హిట్ అందుకుంటాడేమో చూడాలి. అలాగే హీరోగానే కాకుండా కళ్యాణ్ రామ్.. త్వరలో ఎన్టీఆర్ - కొరటాల శివ సినిమాకు నిర్మాతగా కూడా మారనున్నాడు.