Begin typing your search above and press return to search.

వైరల్ అవుతున్న నందమూరి వారసుడి లేటెస్ట్ ఫోటోలు..!

By:  Tupaki Desk   |   6 March 2021 3:30 PM GMT
వైరల్ అవుతున్న నందమూరి వారసుడి లేటెస్ట్ ఫోటోలు..!
X
నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని అభిమానులందరులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అప్పట్లో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో మోక్షజ్ఞ హీరోగా లాంచ్ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా ఉంటుందని టాక్ వచ్చింది. ఏదీ ముందుకు కదలలేదు. అందులోను నందమూరి వారసుడిలో ఫిజిక్ ని ఆతనికి సినిమాలపై ఆసక్తి లేదనే కామెంట్స్ కూడా వచ్చాయి. అయితే గతేడాది బాలయ్య బర్త్ డే సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు ,క్లారిటీ ఇచ్చాడు. మోక్ష‌జ్ఞ ఎంట్రీకి భారీగా ప్లాన్స్ వేసుంచానని.. అద్భుతమైన స్క్రిప్ట్స్ కూడా తీసి పెట్టానని.. అన్నీ కుదిరినప్పుడు లాంచ్ ఉంటుందని చెప్పుకొచ్చాడు. దీంతో కాస్త లేట్ అయినా మోక్షజ్ఞ వెండితెర ఎంట్రీ పక్కా అని నందమూరి ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. ఈ నేపథ్యంలో మోక్షజ్ఞ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నందమూరి బాలకృష్ణ మనవళ్లు దేవాన్ష్ - ఆర్యవీర్ ల అక్షరాభ్యాసం బాసరలో వైభవంగా జరిగింది. బాలయ్య పెద్ద కుమార్తె బ్రాహ్మణి కుమారుడు దేవాన్ష్ కాగా.. ఆర్యవీర్ రెండో కూతురు తేజస్విని కుమారుడు. ఈ కార్యక్రమంలో మోక్షజ్ఞ ఫోటోలు నందమూరి అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ పిక్స్ లో మోక్షజ్ఞ లుక్స్ పరంగా ఇంతకముందు కంటే చాలా డిఫరెంట్ గా ఉన్నాడు. వర్కౌట్స్ చేసి మోక్షజ్ఞ లుక్ మార్చేశాడని.. హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయినట్లేనని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మొత్తం మీద నందమూరి వారసుడి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో తెలియదు కానీ.. మోక్షజ్ఞ కొత్త లుక్ మాత్రం అభిమానులను సంతృప్తి పరిచిందనే చెప్పాలి. ఇకపోతే మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడున్నా సాయి కొర్రపాటి వారాహీ చలన చిత్రం పతాకంపైనే అతని లాంచింగ్ ఉంటుందని టాక్ నడుస్తోంది. ఈ మ‌ధ్యే 23వ ఏట అడుగుపెట్టిన మోక్షు ఎంట్రీ త్వరలోనే ఉంటుందేమో చూడాలి.