పూరీ - అనిల్ రావిపూడి సినిమాలపై బాలయ్య క్లారిటీ..!

Wed Jul 21 2021 16:06:06 GMT+0530 (IST)

Nandamuri Balakrishna Gives Clarity On Puri And Anil Ravipudi Movies

నటసింహం నందమూరి బాలకృష్ణ ఆరు పదుల వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ దూకుడుగా వెళ్తున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో హ్యాట్రిక్ మూవీగా ప్రస్తుతం 'అఖండ' అనే యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు బాలయ్య. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ద్వారాక క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ మూవీ సెట్స్ పై ఉండగానే 'క్రాక్' తో బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ గోపీచంద్ మలినేని తో '#NBK107' మూవీ ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని - వై.రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. వాస్తవ సంఘటన ఆధారంగా ఓ పవర్ ఫుల్ స్టోరీతో ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది. అయితే ఈ రెండు సినిమాల తర్వాత బాలయ్య చేయబోయే సినిమాల గురించి ఈ మధ్య అనేక వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లైనప్ పై నందమూరి నటసింహ క్లారిటీ ఇచ్చారు.

'ఆదిత్య 369' చిత్రం 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన బాలకృష్ణ.. 'అఖండ' తర్వాత చేయబోయే సినిమాల గురించి వెల్లడించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా.. దాని తర్వాత హరికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఒక చిత్రం చేయనున్నట్లు బాలయ్య తెలిపారు. అంతేకాదు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు.

ఈ సందర్భంగా ఇకపై ఏడాదికి మూడు సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు బాలకృష్ణ చెప్పుకొచ్చారు. ఇకపోతే 'ఆదిత్య 369' కు సీక్వెల్ గా 'ఆదిత్య 999 మాక్స్' సినిమా చేయనున్నట్లు ఇదివరకే వెల్లడించారు. సీక్వెల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని.. ఈ సినిమాతో తనయుడు మోక్షజ్ఞ తెరంగేట్రం ఉంటుందని మరోసారి గుర్తు చేశారు. 'ఆదిత్య 999 మాక్స్' చిత్రాన్ని 2023లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని బాలకృష్ణ అన్నారు.