బాలయ్య మళ్లీ అదరగొడతారట

Fri May 13 2022 21:00:01 GMT+0530 (IST)

Nandamuri Balakrishna 107 Movie

చాలా రోజుల తరువాత `అఖండ` తో అఖండమైన బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నారు నందమూరి బాలకృష్ణ. ఈ సినిమాతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చిన బాలయ్య ఇందులో అఖండగా మురళీకృష్ణగా రెండు విభిన్నమైన పాత్రల్లో నటించి అదరగొట్టేశారకు. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టిన బాలయ్య మరోసారి ఇదే ఫీట్ ని రిపీట్ చేయబోతున్నారని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. `అఖండ` బ్లాక్ బస్టర్ హిట్ తో రెట్టించిన జోష్ లో వున్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం `క్రాక్`తో ఫామ్ లోకి వచ్చిన గోపీచంద్ మలినేనితో ఓ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ని చేస్తున్న విషయం తెలిసిందే.మైత్రీ మూవీమేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. గోపీచంద్ మలినేని కూడా `క్రాక్` హిట్ ని ఈ సినిమాతో మళ్లీ రిపీట్ చేయాలనే ప్రతీ విషయంలోనూ కేర్ తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే హీరోయిన్ గా శృతిహాసన్ ని ఫైనల్ చేసిన ఆయన కీలక పాత్ర కోసం మరోసారి జయమ్మ వరలక్ష్మీ శరత్ కుమార్ ని ఎంచుకున్నాడు. మలయాళ నటుడు దర్శకుడు లాల్ దునియా విజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ప్రస్తుతం చిత్రీకరణ దశలో వున్న ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. కాగా ఈ చిత్రానికి `అన్నగారు` అనే టైటిల్ ని మేకర్స్ పరిశీలిస్తున్నారు. దాదాపుగా ఇదే టైటిల్ ఫైనల్ అని చిత్ర వర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన బాలయ్య ఏజ్డ్ క్యారెక్టర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. సినిమాలో బాలకృష్ణ పాత్ర పేరు వీరారెడ్డి. రాయలసీమ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ మూవీలో బాలయ్య `అఖండ` తరహాలో డ్యుయల్ రోల్ లో కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్  మళ్లీ డబుల్ బొనాంజా ఖాయం అంటూ సంబరాలు చేసుకుంటున్నారట.  సినిమాలో రెండు పాత్రలు హై ఎనర్జిటిక్ గా పవర్ ఫుల్ గా సాగుతాయని. అంతే కాకుండా `అఖండ` ని ఫ్యాన్స్ ప్రేక్షకులు మర్చిపోకముందే ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. వేటపాలెంలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని మరింత పవర్ ఫుల్ గా దర్శకుడు గోపీచంద్ మలినేని తెరపైకి తీసుకొస్తున్నారని చెబుతున్నారు. ఇదే నిజమైతే ఫ్యాన్స్ కి పండగే. ఇదే వేట పాలెం నేపథ్యంలో `క్రాక్` చిత్రాన్ని తెరకెక్కించి గోపీచంద్ మలినేని బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.