Begin typing your search above and press return to search.

ఆ దిగ్గజ నటుడు చెప్పిన చేదు నిజాలివీ

By:  Tupaki Desk   |   28 May 2020 11:30 AM GMT
ఆ దిగ్గజ నటుడు చెప్పిన చేదు నిజాలివీ
X
నానా పటేకర్.. ఈ బాలీవుడ్ విలక్షణ నటుడు తెరమీదే కాదు.. తెర బయట కూడా అంతే అగ్రెసివ్. తనకు ఎదురైన అనుభవాలన్నింటిపై స్పందిస్తాడు. అవినీతి జరిగితే ప్రశ్నిస్తాడు. అన్యాయాన్ని ఎలుగెత్తి చాటుతాడు. రాజకీయాలపై తాజాగా ఆయన సంధించిన మాటల తూటాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మన సమాజంలోని కుల్లును చూపిస్తున్నాయి. ప్రజలు ఇలా ఉండే బట్టే రాజకీయాలు ఇలా సాగుతున్నాయని నానా పటేకర్ కవితాత్మక రూపంలో ‘బోల్ ఇండియా బోల్ - చేదు నిజాలు’ అంటూ సంచలన కవితలను, డైలాగులుగా పేల్చారు. అవేంటో చూద్దాం..

* రైతులు పొలంలో - రైతుల కొడుకులు సైన్యంలో మరణిస్తారు, కానీ నాయకులు దేశంలో, వారి సంతానం విదేశాల్లో, సౌఖ్యాలు పొందుతారు.

*చేదు నిజం ఏమంటే.. ఈ దేశ వాసులమైన మనం ఇక్కడ పి.హెచ్.డి, గ్రాడ్యుయేషన్, మెడిసిన్, ఇంజనీరింగ్ చదివిన వాళ్లం, టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళకు ఓటు వేసి, నేతలుగా ఎన్నుకొని, వారి నుండి మన బంగారు భవిష్యత్తు కోసం కలలు కంటుంటాం. ఆలోచించండి

* రాజకీయ నేతలు కావాలనుకొనే వాళ్ళు ఐదు సంవత్సరాలు సైన్యంలో ఖచ్చితంగా పనిచేసి తీరాలన్న నిబంధన పెడితే, దేశంలో 80 శాతం ఉత్పాతాలు (దరిద్రాలు) వాటంతట అవే సర్దుకుంటాయి.

*25 - 30 సంవత్సరాల పాటు ఉద్యోగాలు చేసిన వాళ్లకు పెన్షన్ ఉండదు.. కానీ, ఐదేళ్లు రాజకీయ నేతగా పదవి వెలగబెడితే మాత్రం జీవితాంతం పెన్షన్, ఇతర సదుపాయాలు* ఇస్తున్నారు.ఇలా ఎందుకు ఇవ్వాలి?

* నాయకులపైకి చెప్పులో, కోడి గుడ్లో, నల్ల సిరానో, విసిరితే ఆ వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేస్తారు.కానీ, భారతీయ సైన్యం పై రాళ్ల దాడి చేసే వాళ్లకు మాత్రం మినహాయింపు ఇస్తారు. ఎందుకు?

* రైతుల సరుకుల వాహనాలపై తోలు వలిచి టోల్ వసూలు చేస్తున్నారు.కానీ, మంత్రి మహాశయుల వాహనాలకు అదేమీ ఉండదు. రైతు తినేది దొంగ సొమ్మా?
నేతలు తినేది కష్టార్జితమా? ఇదేమి న్యాయం.

*విద్యలో రాజకీయం 100%, రాజకీయంలో విద్య 00% ఆహా ఎంత గొప్ప విధానం మన ఈ దేశంలో.ఇందుకేనేమో రాజకీయం అంతా చెత్త తో నిండిపోయింది..దేశంలోని ప్రతిభావంతులేమో వలస పక్షులు అవుతున్నారు.

దేశంలోని ప్రభుత్వ పాఠశాలల్లో, ధర్మాసుపత్రుల్లో పరిస్థితులు మారాలంటే, నేతల పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదవాలి -
వారి రోగాలకు చికిత్సలు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరగాలి.
అప్పుడే పరిస్థితులలో మార్పు చూస్తాం.

*₹399కి అపరిమిత కాల్స్ డేటా దొరుకుతుంటే ప్రజాప్రతినిధులకు నెలసరి ₹15000 టెలిఫోన్ భత్యం ఎందుకు?*

*ప్రజల చర్మం వలిచి పన్నులు వసూలు చేసే కోట్ల రూపాయలను ఇలా వృధాగా ఖర్చుచేయడం అవసరమా? అందరూ ఆలోచించాలి.

అంటూ నానా పటేకర్ సంధించిన ఈ మాటల తూటాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.