క్లిక్ క్లిక్ : సీతూ పాత ఇంతలో ఎంత మార్పు

Wed Nov 25 2020 18:30:32 GMT+0530 (IST)

Click ? Click?: How old Seetu has changed in the meantime

మహేష్ బాబు కూతురు సితార ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఈమద్యే సీతూ పాప చిన్న పిల్లలా కనిపించేది. ఆమె డాన్స్ చేసిన వీడియోలు.. తండ్రి ఒడిలో కూర్చున్న ఫొటోల్లో సితార చిన్నగా కనిపిస్తుంది. ఇప్పటికి ఆ ఫొటోలు ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. తాజాగా నమ్రత షేర్ చేసిన ఫొటోల్లో తండ్రి బుజాల వరకు పెరగినట్లుగా కనిపిస్తుంది. సితార పాప ఎంత స్పీడ్ గా హైట్ పెరుగుతుంది కదా అంటూ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే మహేష్ బాబు తనయుడు గౌతమ్ తండ్రి అంత హైట్ అయ్యాడు. ఇద్దరు పక్కన నిల్చుంటే అన్న తమ్ముడు అనుకునేట్లుగా ఉన్నారు. సితార కూడా చాలా స్పీడ్ గా పెరుగుతూ మహేష్ బాబును పెద్ద వాడిని చేస్తుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే తన ఎత్తు పిల్లలు అయినా కూడా మహేష్ బాబు మాత్రం ఇంకా పాతికేళ్ల కుర్రాడిగా కనిపించడం అతడి గొప్పతనం అతడి అందం యొక్క గొప్పతనం అంటూ అంతా అభినందిస్తున్నారు. ఈ ఫొటోల్లో సితారను చూస్తే ఇంతలో ఎంత మార్పు అనిపిస్తుంది కదా..!