సూపర్ కిడ్స్.. సూపర్ స్మైల్

Thu Oct 28 2021 11:01:53 GMT+0530 (IST)

Namrata shared Spain Tour photos

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో ఏదో ఒక విషయంతో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా సితార తన క్యూట్ పిక్స్ తో అభిమానులతో పాటు అందరి మనసు దోచుకుంటూ ఉంది. క్యూట్ సితార పాప క్యూట్ నవ్వు చాలా స్వచ్చంగా అనిపిస్తుందని అభిమానులు అంటూ ఉంటారు. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రం షూటింగ్ కోసం స్పెయిన్ లో ఉన్న విషయం తెల్సిందే. మహేష్ బాబు తో కలిసి నమ్రత మరియు ఇద్దరు పిల్లలు కూడా స్పెయిన్ వెళ్లారు. అక్కడ మహేష్ బాబు షూటింగ్ తో బిజీగా ఉంటే నమ్రత మరియు పిల్లలు మాత్రం అక్కడి హాలీడే స్పాట్స్ లో తెగ ఎంజాయ్ చేస్తున్నారు.గత కొన్ని రోజులుగా రెగ్యులర్ గా స్పెయిన్ టూర్ ఫొటోలను నమ్రత షేర్ చేస్తూనే ఉంది. తాజాగా ఈ ఫొటోను నమ్రత ఇన్ స్టా లో షేర్ చేసింది. ఇందులో గౌతమ్ మరియు సితారలను చూడవచ్చు. ఇద్దరు కూడా చాలా క్యూట్ గా ఉన్నారు. సితార ఎల్లో టీ షర్ట్ లో జుట్టు లీవ్ చేసుకుని ఏదో విషయానికి చాలా నవ్వుతూ ఉంది. కళ్లు మూసుకుని సితార నవ్వుతూ ఉంటే గౌతమ్ కూడా అందుకు తగ్గట్లుగా కాస్త గట్టిగానే నవ్వుతున్నాడు. సహజంగా అయితే గౌతమ్ ఎక్కువ నవ్వడం మనం చూడం. ఎందుకంటే తన తండ్రి మాదిరిగానే కాస్త రిజర్వ్ గా ఉంటూ ఫేస్ లో గంభీర్యంను గౌతమ్ చూపిస్తూ ఉంటాడు. కాని ఈ ఫొటోలో మాత్రం గౌతమ్ నవ్వును చూడవచ్చు.

మహేష్ బాబు ఇద్దరు పిల్లలు కూడా సోషల్ మీడియా సెన్షేషన్ అనడంలో సందేహం లేదు. ఇద్దరికి ఇద్దరు కూడా రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే సర్కారు వారి పాట సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. వచ్చే ఏడాది లో ఈ సినిమా విడుదల అవ్వబోతుంది. సర్కారు వారి పాట సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాను చేసేందుకు మహేష్ సిద్దం అవుతున్నాడు. ఇక ఆ తర్వాత జక్కన్న దర్శకత్వం లో కూడా మహేష్ బాబు సినిమా ఉండబోతుందనే విషయం అందరికి తెల్సిందే.