మహేష్ - పైడిపల్లి బృందం సరదా సాయంత్రాలు

Sun Dec 05 2021 21:00:01 GMT+0530 (IST)

Namrata Shirodkar On Instagram

సూపర్ స్టార్ మహేష్ కుటుంబంతో డైరెక్టర్ వంశీ పైడిపల్లి స్నేహానుబంధం గురించి తెలిసిందే. మహర్షి చిత్రంతో విజయం అందుకున్న ఈ జోడీ మరో సినిమా చేయాలన్న ప్లాన్ తో ఉన్నారు. కానీ ఇంతకుముందు వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత పైడిపల్లి తమిళంలో దళపతి విజయ్ తో పని చేసే అవకాశం దక్కించుకున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.ఇక మహేష్ - నమ్రత దంపతులతో పైడిపల్లి - మాలిని పైడిపల్లి ఎంతో క్లోజ్ గా ఉంటారు. ఈ జంటల వారసురాళ్లు సితార-ఆద్య కూడా యూట్యూబ్ చానెల్ ని ప్రారంభించి అంతర్జాలంలో దూసుకెళ్లారు. ఏ అండ్ ఎస్ పేరుతో ఇప్పటికే సోషల్ మీడియాల్లో బోలెడంత ప్రమోషన్ దక్కించుకున్నారు. ఇక విదేశీ వెకేషన్స్ కి కానీ హైదరాబాద్ లో డిన్నర్ డేట్ కి కానీ ఈ ఇరు కుటుంబాలు కలిసి వెళుతుంటాయి.

శనివారం సాయంత్రం మహేష్ -నమ్రత కుటుంబంతో కలిసి పైడిపల్లి ఫ్యామిలీ సరదా సాయంత్రాన్ని ఆస్వాధించింది. అందుకు సంబంధించిన ఓ ఫోటోని నమ్రతశిరోద్కర్ ఇన్ స్టాలో షేర్ చేయగా వైరల్ గా మారింది. ``నిన్న రాత్రి గురించి!! సరదా సాయంత్రాలు.. మంచి సమయాలు!!`` అంటూ క్యాప్షన్ ని ఇచ్చారు నమ్రత. ఈ పార్టీలో రామ్ జూపల్లి.. మేఘన.జె రావ్ కూడా ఉన్నారు.