Begin typing your search above and press return to search.

మానిక్యూరిస్ట్ గా మారిన సూపర్ స్టార్ డాటర్...!

By:  Tupaki Desk   |   24 May 2020 3:53 AM GMT
మానిక్యూరిస్ట్ గా మారిన సూపర్ స్టార్ డాటర్...!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు లిటిల్ ప్రినెన్స్ సితార పాప నెటిజ‌న్స్‌ కి చాలా సుప‌రిచితమే. చిన్నారికి సంబంధించిన సింగింగ్‌ వీడియోలు.. డ్యాన్సింగ్ లేదా ఇత‌ర‌త్రా వీడియోలు మ‌హేష్ బాబు లేదా సితార రెగ్యులర్ గా షేర్ చేస్తూ ఉంటారు.ఈ స్టార్ కిడ్ సితార కు సోషల్ మీడియాలో ఉండే ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆమె తండ్రి మహేష్ తో చేసే అల్లరి వీడియోలతో సూపర్ పాపులారిటీ తెచ్చిపెట్టాయి. ఏడేళ్ల ప్రాయంలోనే ఈ చిచ్చర పిడుగు అప్పుడే వంశీ పైడిప‌ల్లి కూతురు ఆద్య‌తో క‌లిసి 'ఎ అండ్ ఎస్' అనే ఓ యూట్యూబ్ ఛానల్ నడుపుతుండగా.. దీనికి లక్షకు మించిన సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో స్కూల్స్ కూడా క్లోజ్ అయి ఉండటంతో సితార ఇంట్లో చేసే అల్లరి పనులు.. క్యూట్ వీడియోస్ వాళ్ళ అమ్మ నమ్రత సోషల్ మీడియాలో పంచుకుంటుంది. తాజాగా సితారకు సంబంధించి మరో వీడియో ఆమె ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసారు.

ఈ వీడియోలో సితార పాప తల్లి నమ్రతకు మానిక్యూర్ చేస్తోంది. నమ్రత ఈ విషయాన్ని తెలియజేస్తూ ''బ్రేకింగ్ న్యూస్!! టౌన్ లోకి కొత్తగా వచ్చిన మానిక్యూర్ ఆవ్ సమ్ గా ఉంది. ఈ రోజే మీరు అపాయింట్ మెంట్ తీసుకోండి'' అంటూ క్యాప్షన్ జత చేసింది. సితార ప్రొఫెషనల్ గా మానిక్యూర్ చేసే విధానం అందరిని ఆహ్లాదపరుస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. సింగింగ్.. డాన్సింగ్ టాలెంట్ తో పాటు బ్యూటీషియన్ స్కిల్స్ కూడా సితారలో ఉన్నాయని అర్థం అవుతోంది. ఈ స్టార్ కిడ్ మల్టీ టాలెంటెడ్ అని మరోసారి నిరూపించుకుంది. ఇకపోతే మహేష్ బాబు కూడా అనుకోకుండా వచ్చిన ఈ సమయాన్ని ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. డైలీ తన పిల్లలతో కలిసి అల్లరి చేస్తూ ఆ వీడియోలను అభిమానులకు షేర్ చేస్తూ వస్తున్నాడు.


వీడియో కోసం క్లిక్ చేయండి