ఎల్సా గురించి సూపర్ స్టార్ గారాలపట్టి!

Tue Nov 19 2019 19:08:59 GMT+0530 (IST)

Namrata Shares Sitara Adorable Interview!

సూపర్ స్టార్ మహేష్ బాబు-నమ్రతల ముద్దుల కూతురు సితార సోషల్ మీడియాలో చాలా పాపులర్.  మహేష్.. నమ్రత ఇద్దరూ సితార పాపకు సంబంధించిన ఏదో ఒక విశేషం షేర్ చేస్తూ ఉంటారు కాబట్టి సోషల్ మీడియాలో పాపులర్ అయింది. సితార ఈమధ్య 'ఫ్రోజెన్  2' సినిమాలో బేబీ ఎల్సా పాత్రకు గాత్రం అందించిన సంగతి తెలిసిందే.  ఈ విషయం గురించి సితార.. నమ్రత మాట్లాడుతూ ఉన్న ఒక వీడియోను నమ్రత తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేశారు.ఈ వీడియోలో సితార తనకు ఎల్సా పాత్ర ఎంత ఇష్టమో చెప్పింది.  ఎల్సా తనకు చిన్నప్పటి నుంచి ఇష్టమైన క్యారెక్టర్ అని.. తన ఫ్రెండ్స్ తో ఈ విషయంలో ఫైట్ కూడా చేసుకునేవారిమని చెప్పింది.  తనకు ఎల్సా లాగా డ్రెస్ చేసుకోవడం చాలా ఇష్టమని చెప్పింది.  ఎల్సా ధరించే దుస్తులు తనవద్ద చాలా ఉన్నాయని చెప్పింది. "మా ఇంటికి వచ్చి నా కప్ బోర్డ్ ఓపెన్ చేస్తే ఎలా డ్రెస్ లు ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది" అంటూ చెప్పింది సితార పాప.

ఇక నమ్రత మాట్లాడుతూ "సితారకు ఫ్రోజెన్ అంటే చాలా ఇష్టం.  తన దగ్గర బెడ్ షీట్.. పిల్లో కవర్స్ అన్నీ ఎల్సావే.  బేబీ ఎల్సా పాత్రకు సితార వాయిస్ అడిగినప్పుడు నాకు సితార చెయ్యగలదా అని డౌట్ వచ్చింది. కానీ ఎంతో ఇష్టంతో చేసింది" అని చెప్పారు.  ఎంతైనా సూపర్ స్టార్ కూతురు కదా.. అలా సెట్ అవుతుంది అంతే.

వీడియో కోసం క్లిక్ చేయండి