కొడుకు ఫొటోతో సంతోషం షేర్ చేసిన నమ్రత

Tue Jul 07 2020 10:15:40 GMT+0530 (IST)

Namrata Shares Gautam Pic On Instagram

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ ఈమద్య కాలంలో సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మహేష్ బాబు నమ్రత వేరు వేరుగా పిల్లల ఫొటోలు షేర్ చేయడంతో పాటు వారి ఆట పాటలను షేర్ చేస్తూ గౌతమ్ సితారలను ఇప్పటికే జనాల్లో స్టార్స్ ను చేశారు. ఇద్దరు పిల్లలు కూడా చూస్తుండగానే పెద్ద వారు అవుతున్నారు. తాజాగా నమ్రత షేర్ చేసిన గౌతమ్ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.ఎలూసివ్ (అంతుచిక్కని) సన్ అంటూ గౌతమ్ ఫొటోకు కామెంట్ పెట్టి మరీ నమ్రత ఈ ఫొటోను షేర్ చేసింది. గౌతమ్ రేర్ పిక్ అంటూ నమ్రత ఈ పొటోను షేర్ చేసి తన కొడుకు ను చూసి మురిసి పోతూ సంతోషాన్ని తన ఫాలోవర్స్ తో షేర్ చేసుకుంది. ఫొటోలో గౌతమ్ హెయిర్ స్టైల్ ఇంకా స్మైల్ పట్ల అభిమానులు ఫిదా అవుతున్నారు. భవిష్యత్తు సూపర్ స్టార్ గౌతమ్ అంటూ అప్పుడే అభిమానులు ఊహల్లో కోటలు కట్టేస్తున్నారు.

మహేష్ బాబు తన కొడుకును ఇప్పటికే వెండి తెరకు పరిచయం చేశాడు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 1 నేనొక్కడినే సినిమాలో మహేష్ బాబు చిన్నప్పటి పాత్రను గౌతమ్ చేసిన విషయం తెల్సిందే. గౌతమ్ బాల నటుడిగా చేసిన సినిమా అదొక్కటే. ఇకపై నటించే అవకాశం లేదు. వెండి తెరపై గౌతమ్ కనిపిస్తే ఇక హీరోగానే అంటూ ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.