Begin typing your search above and press return to search.

ధూమ్-4లో ప్రభాస్.. భలే భలే అంటోంది

By:  Tupaki Desk   |   3 Dec 2015 3:30 PM GMT
ధూమ్-4లో ప్రభాస్.. భలే భలే అంటోంది
X
‘బాహుబలి’తో దేశవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న ప్రభాస్.. యశ్ రాజ్ వాళ్ల ధూమ్ సిరీస్ లో రాబోయే నాలుగో పార్ట్ లో విలన్ గా నటించేస్తున్నాడంటూ రెండు మూడు నెలల కిందట ఓ వార్త హల్ చల్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. మన జనాలు కూడా అది నిజమే అని నమ్మేసి ‘వావ్’ అనుకున్నారు.

కానీ ఇదంతా ప్రభాస్ బ్రాండ్ వ్యవహారాలు చూసి యాడ్ ఏజెన్సీ పబ్లిసిటీ ప్లానింగ్ లో భాగంగా పుట్టించిన పుకారు మాత్రమేనని తర్వాత తెలిసి అందరూ తెల్లబోయారు. ఈ వ్యవహారం ఫుల్ స్టాప్ పడి చాలా కాలమవుతుంటే... కొత్తగా బొద్దుగుమ్మ నమిత ‘ధూమ్-4లో ప్రభాస్’ అనే వార్త చూసి భలే భలే అని సంబరాలు చేసుకుంటోంది.

అప్పుడెప్పుడో ఓ పత్రికలో పబ్లిష్ అయిన వార్తను చూపించి నా ఫ్రెండు ప్రభాస్ (ఇద్దరూ కలిసి బిల్లా సినిమాలో నటించార్లెండి) ఎంత ఎదిగిపోయారో చూశారా.. చాలా హ్యాపీగా ఉందంటూ ఇన్ స్టాగ్రాంలో ఓ పోస్టు పెట్టింది నమిత. ఇదంతా చూసి జనాలకు దొంగలు పడ్డ ఆర్నెల్లకు.. అనే సామెత గుర్తుకొస్తోంది. నమితకు నిజంగానే ఇది రూమర్ అన్న సంగతి తెలియదా లేక తననెవరూ పట్టించుకోకపోవడం చూసి ఫీలై పబ్లిసిటీ కోసం చేసిన స్టంటా ఇది అని జనాలకు ఆశ్చర్యం కలుగుతోంది.