Begin typing your search above and press return to search.

వీడియో: కసి కసి పందాలెన్నో ఎన్నో కాసి.. నను జయించుకుంటే నేస్తం!

By:  Tupaki Desk   |   6 May 2021 10:34 AM GMT
వీడియో: కసి కసి పందాలెన్నో ఎన్నో కాసి.. నను జయించుకుంటే నేస్తం!
X
జడివానై ప్రియా నన్నే చేరుకోమ్మా...శృతి మించుతోంది దాహం ఒక పాన్పుపై పవళిద్దాం...కసి కసి పందాలెన్నో ఎన్నో కాసి.. నను జయించుకుంటే నేస్తం నా సర్వస్వం అర్పిస్తా .. ఎన్నటికి మాయదుగా చిగురాకు తొడిగే ఈ బంధం..!!

`చెలి` సినిమాలోనిది ఈ గీతం. ఇదిగో ఇక్క‌డ అందాల న‌టి నైనా గంగూలీ రెయిన్ ఫీట్ కి బ్యాక్ గ్రౌండ్ లో హిందీ వెర్ష‌న్ వినిపించి ఎంత వ‌య్యారంగా అలా సీన్ ని ర‌క్తి క‌ట్టించిందో చూస్తున్నారు క‌దా!.. ఇంత‌గా క‌వ్విస్తుంది గనుకే ఇంకా ఆర్జీవీ డీ- కంపెనీలో నాయిక‌గా కొన‌సాగుతోంది.

ప్రతి ఉదయం నిను చూసి చెలరేగిపోవాలీ దేహం...అంటూ భువ‌న‌చంద్ర‌ ఎంత రొమాంటిక్ గా ఊహించారో కానీ.. ఈ వీడియో చూశాక యూత్ కి ఆ రేంజులోనే షివ‌రింగ్ గ్యారెంటీ. అన్న‌ట్టు నైనా గంగూలీ ఇంత‌గా ప్ర‌య‌త్నించినా కానీ .. ఈ క‌రోనా ఇలా వెంటాడుతుంటే సినిమాలేవీ రిలీజ్ కావ‌డం క‌ష్ట‌మైపోయింది. ఆర్జీవీ అయితే అస‌లే రిలీజ్ చేయ‌డంలో ఇంకా ఆల‌స్యం చేస్తున్నారు. ఇక‌నైనా గురువు గారిని తొంద‌ర పెట్టి క‌నీసం పెండింగ్ షూట్లు పూర్తి చేయించి ఓటీటీలో అయినా సినిమాల్ని రిలీజ్ అయ్యేలా చేస్తే బావుంటుందేమో.. అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

చ‌రిత్ర‌హీన్ అనే వెబ్ సిరీస్ ఫ్రాంఛైజీ నాయిక‌గానూ నైనా కొన‌సాగుతోంది. ఆర్జీవీ రూపొందించిన `బ్యూటిఫుల్` చిత్రంలో కాక‌లు పుట్టించే రేంజులో చెల‌రేగింది. ఆర్జీవీకే చెందిన డీకంపె‌నీ రూపొందించిన‌ `డేంజరస్` అనే మూవీలోనే లెస్బియన్ గా న‌టిస్తోంది. `జోహార్‌` అనే వేరొక మూవీలోనూ నాయిక‌. ఇవ‌న్నీ ఎప్ప‌టికి వ‌స్తాయో ఏమిటో!!