Begin typing your search above and press return to search.

అందుకే ఆ పాత్ర చేశా: నగ్నం హీరోయిన్ స్వీటీ

By:  Tupaki Desk   |   2 July 2020 9:30 AM GMT
అందుకే ఆ పాత్ర చేశా: నగ్నం హీరోయిన్ స్వీటీ
X
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘నగ్నం’ లఘుచిత్రం ఆన్ లైన్‌ లో కాసుల వర్షం కురిపిస్తుంది. ఆయన గత చిత్రాల లాగే కొన్ని అంశాలు మిస్సయినా ఆర్జీవీ కాన్సెప్ట్ మాత్రం కమర్షియల్ గా ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. ముందుగా ‘నగ్నం’ అనేది ఒకటి తీస్తున్న అని చెప్పి షాక్ ఇచ్చిన వర్మ ఆ వెంటనే నగ్నం టీజర్, ట్రైలర్‌ లు విడుదల చేశాడు. మియా మాల్కోవా తో క్లైమాక్స్ చూపించిన వర్మ ఈసారి వెస్ట్ గోదావరి స్వీటీ పాప తో ‘నగ్నం’ చూపిస్తున్నాడు. ఇక ఈ నగ్నం లో నటించిన హీరోయిన్‌ ని సోషల్ మీడియా లో స్వీటీ గా పరిచయం చేశాడు వర్మ. స్వీటీ ది వెస్ట్ గోదావరిలోని దేవరపల్లి అని చెప్తూ ఆమెకు సంబంధించిన ‘నగ్నం’ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు వర్మ. సినిమా విడుదల అయిందో లేదో వరుస ఇంటర్వ్యూలు ఇచ్చేస్తోంది స్వీటీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమెకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టింది. స్వీటీ అసలు పేరు శ్రీ రాపాక.

ఇండస్ట్రీలో ముద్దుగా శ్రీ అనిపిలుస్తారట. ఈమెకు ఇండస్ట్రీ తో మంచి అనుబంధమే ఉంది. టీవీ రంగంలో కూడా సత్తా చాటిందని అంటుంది. తన కెరీర్ గురించి చెప్తూ.. ‘రంగస్థలం షోతో పాటు కబడ్డీ లీగ్స్‌లో పాల్గొన్నాను. స్టార్ వార్‌తో పాటు కిర్రాక్ కబాడీ ట్రోపీల విన్నర్‌ని నేనే. ఆ తరువాత రంగస్థలం షో చేశా.. జెమినిలోనే టాప్ రేటింగ్ షో రంగస్థలంలో చాలా రోజులు చేశా. ఫైనల్ వరకూ వెళ్లా. బేసిక్‌ గా నేను ఫ్యాషన్ డిజైనర్‌ ని.. తెలుగు, కన్నడ, తమిళ్‌లో 40కి పైగా చిత్రాలకు క్యాస్ట్యూమ్ డిజైనర్‌ గా చేశా. హైదరాబాద్ నిఫ్ట్‌ లో చదువుకున్నా. మాస్టర్స్ యూఎస్‌ లో చేశా. నిఫ్ట్‌ లో చేస్తూనే సినిమాలకు క్యాస్ట్యూమ్ డిజైనర్‌ గా పని చేశా. ఇంటర్మీడియట్ అవ్వగానే నిఫ్ట్‌ల్ జాయిన్ అయ్యా.. ఫస్ట్ ఇయర్ నుంచి సినిమాలకు క్యాస్ట్యూమ్ డిజైనర్‌ గా చేస్తున్నా.

ఇంకా దేశముదురు, చందమామ, యువత, నచ్చావులే ఇలా చాలా సినిమాలకు ఫ్యాషన్ డిజైనర్‌గా చేశా. ఇటీవలే వలయం సినిమాకి క్యాస్ట్యూమ్ డిజైనర్ నేను. ఆ సినిమాలో చేసే ఓ ఆర్టిస్ట్ టైంకి రాకుండా హ్యాండ్ ఇచ్చింది. అదే టైంకి నన్ను చేయమని అడిగారు. నిజానికి నాకు చిన్న చిన్న క్యారెక్టర్లు చేయడం ఇష్టం లేదు. నిజానికి నాకు ఫిదా సినిమాలో సాయి పల్లవి సిస్టర్‌గా చేయమని శేఖర్ కమ్ముల గారు అడిగారు.. కాని నేను చేయనని చెప్పాను. వలయం సినిమాకోసం బలవంతం పెట్టారు. అందుకే ఆ సినిమాలో ఒక పాత్ర చేశా. అయితే ఈ సినిమాకి పని చేసిన వెంకట్ అనే అబ్బాయి.. నగ్నం సినిమా కి అసిస్టెంట్ డైరెక్టర్ కావడం తో నాకు మళ్లీ అవకాశం వచ్చింది’ అంటూ షేర్ చేసింది శ్రీ అలియాస్ స్వీటీ. చూడాలి మరి అమ్మడి కెరీర్ ఎలా ఉండబోతుందో..!