Begin typing your search above and press return to search.

వర్మ నగ్నం హీరోయిన్‌ గురించి షాకింగ్‌ విషయాలు

By:  Tupaki Desk   |   4 July 2020 11:30 AM GMT
వర్మ నగ్నం హీరోయిన్‌ గురించి షాకింగ్‌ విషయాలు
X
రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కి ఇటీవలే డిజిటల్‌ పార్మెట్‌ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘నేకెడ్‌’ చిత్రంలో హీరోయిన్‌ గా నటించిన స్వీటీ అలియాస్‌ శ్రీ రాపాక గురించి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చాలా బోల్డ్‌ గా నటించిన ఆమె ఎవరు.. అసలు ఆమెకు ఇండస్ట్రీతో గతంలో సబంధం ఉందా వర్మ ఆమెను ఎలా పట్టుకున్నాడు అంటూ అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెళ్లడి చేసింది.

శ్రీ రాపాక చాలా కాలం నుండే ఇండస్ట్రీలో కొనసాగుతోంది. పలు సినిమాలకు ఈమె కాస్ట్యూమ్స్‌ డైరెక్టర్‌ గా వ్యవహరించిందట. అనీల్‌ రావిపూడి సుప్రీం చిత్రంకు కాస్ట్యూమ్స్‌ డైరెక్టర్‌ గా వ్యవహరిస్తున్న సమయంలో రాశిఖన్నాతో గొడవ కూడా జరిగిందట. ఆ సమయంలో ఇద్దరి మద్య చాలా పెద్ద వివాదం అవ్వడంతో ఆ సినిమా నుండి శ్రీ తప్పుకుందట. ఇక నేకెడ్‌ సినిమా గురించి శ్రీ మాట్లాడుతూ అలాంటి పాత్రను వర్మ కాకుండా మరెవ్వరు కూడా ఆఫర్‌ చేస్తే నేను చేసేదాన్ని కాదు. వర్మ వంటి గొప్ప టెక్నీషియన్‌ ఆ ఆఫర్‌ ఇవ్వడం వల్లే నేను చేశాను.

ముందు ముందు నేను వ్యాంప్‌ పాత్రల్లో నటిస్తానంటూ వస్తున్న వార్తలు నిజం కాదు. నేను ఎప్పుడు కూడా డబ్బుకు ఇంపార్టెంట్‌ ఇవ్వలేదు. యాక్టింగ్‌ నాకు సెకండ్‌ ఛాయిస్‌ మాత్రమే. నేను నిఫ్ట్‌ లో టాపర్‌ స్టూడెంట్‌ ను స్పోర్ట్స్‌ లో కూడా నాకు మంచి ప్రావిణ్యం ఉంది. సినిమా ఇండస్ట్రీలో నాకు సిల్క్‌ స్మిత అంటే చాలా అభిమానం. నాకు ఆమె చాలా విషయాల్లో ఆదర్శం. ఆమె కోసం టాప్‌ హీరోలు సైతం వెయిట్‌ చేసేవారు. ఆమె కేవలం వ్యాంప్‌ పాత్రలు మాత్రమే కాకుండా ఒక మంచి నటిగా గుర్తింపు దక్కించుకున్నారు. మంచి నటిగా మాత్రమే పేరు దక్కించుకోవాలని చూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది.