Begin typing your search above and press return to search.

ఆర్జీవీ ఆవిష్కరించిన హార్రర్ థ్రిల్లర్ 'నఘం' టీజర్..!

By:  Tupaki Desk   |   16 May 2022 5:34 PM GMT
ఆర్జీవీ ఆవిష్కరించిన హార్రర్ థ్రిల్లర్ నఘం టీజర్..!
X
ఏ భాషలో అయినా హార్రర్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ఓ వర్గం ప్రేక్షకులు ఎప్పుడూ ఉంటారు. అలాంటి వారి కోసమే ఇప్పుడు ''నాఘం'' అనే సినిమా వస్తోంది. 'ఎ టేల్ ఆఫ్ మ్యూజిక్' అనేది దీనికి ట్యాగ్ లైన్. నరసింహ జీడీ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది.

ఇటీవలే మేకర్స్ 'నాఘం' సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. తాజాగా సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా టీజర్ ను లాంచ్ చేసి చిత్ర బృందానికి తన విషెస్ అందజేశారు.

"ఈ యూనిక్ మ్యూజికల్లీ హార్రిఫైయింగ్ థ్రిల్లర్ 'నఘం' టీజర్ చూడండి" అని ట్వీట్ చేసిన ఆర్జీవీ.. తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఈ వీడియోని అభిమానులతో పంచుకున్నారు.

హర్రర్ థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడే వారిని 'నాఘం' సినిమా ఆకర్షిస్తుందని టీజర్ ని బట్టి అర్థం అవుతుంది. స్టోరీ ఏంటనేది రివీల్ చేయకుండా సినిమాపై ఆసక్తి కలిగించేలా ఈ టీజర్ ను కట్ చేశారు.

అన్ని హారర్ చిత్రాల మాదిరిగానే ఓ హాంటెడ్ హౌస్ లో కథంతా సెట్ చేయబడింది. కొందరు వ్యక్తులు ఆ ఇంట్లో ఎంటర్ అయిన దగ్గర నుంచి వారిని ఓ ఆత్మ వెంటాడుతున్నట్లు చూపించారు. దీని వెనుక కథేంటో తెలియాలంటే 'నాఘం' సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

ఎలాంటి డైలాగ్స్ లేకుండా కేవలం ఆకర్షణీయమైన బ్యాగ్రౌండ్ స్కోర్ తో థ్రిల్ కు గురి చేసే సన్నివేశాలతో వచ్చిన ఈ వీడియో ఆకట్టుకుంటోంది. విజువల్స్ హారర్ సినిమాలకు తగ్గట్టుగా ఉన్నాయి.

'నఘం' సినిమాలో గణేష్ రెడ్డి - వేమి మమతా రెడ్డి - అయేషా టక్కి - రాజేంద్ర కుమార్ - శరత్ చంద్ర - లక్కీ - దానయ్య - శివ దోసకాయల - మెర్సీ మిరాకిల్ - గౌతమ్ మన్నవ మరియు మణి గోగిశెట్టి తదితరులు నటించారు.

దేవోజు లింగాచారి ఈ సినిమాకు కథ అందించారు. భగవత్ (కరుణాకర్) సంగీతం సమకూర్చగా.. అరవింద్ బి సినిమాటోగ్రఫీ అందించారు. కిచ్చు ఎడిటింగ్ వర్క్ చేశారు. విభు ప్రొడక్షన్స్ బ్యానర్ పై శివ దోసకాయల ఈ చిత్రాన్ని నిర్మించారు.