అక్కినేనీస్ చొక్కాలు ఎక్స్ ఛేంజ్ స్కీమ్

Sun Dec 08 2019 13:04:18 GMT+0530 (IST)

Nagarjuna and Naga Chaitanya Wardrobe Moment

ట్రెండ్ ని ఫాలో చేయడంలో కింగ్ తర్వాతనే. నాగార్జున గ్లామర్ రహస్యం ఏమిటో ఆయన పాటించే ఆరోగ్య సూత్రాలేమిటో తెలిసింది కొద్దిమందికే. ప్రతిసారీ అభిమానుల నుంచి తనకు ఈ ప్రశ్న ఎదురవుతూనే ఉంటుంది ఇందుకే.  ట్రెండ్ ని ఫాలో అవుతూ ఆయన నేటి తరానికే కాదు.. వారసులకే పోటీనిస్తున్నారు. సామాజిక జనుల కామెంట్లలో చైతూ.. అఖిల్ కంటే కింగ్ నాగార్జుననే నవమన్మధుడిలా కనిపిస్తారన్న వాదన వినిపిస్తుంటుంది. గ్లామర్ ఎలివేషన్ లో టాలీవుడ్ హీరోలందరికంటే కింగ్ ఓ ట్రెండ్ సెట్టర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.60 ఏజ్ లోనూ ఆయనలో అదే స్పీడ్. ఇటీవల బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్ గా ఆయన ధరించిన ట్రెండీ డిజైనర్ దుస్తులు యూత్ లో హాట్ టాపిక్ అయ్యాయి. ఇక డాడ్ ని నాగ చైతన్య ఒక్కరోజైనా అనుసరించాలని అనుకున్నారో ఏమో.. ఏకంగా ఇలా నాన్నగారి చొక్కాని తొడుక్కున్నాడంటూ ఈ ఫోటోని షేర్ చేయడమే గాక..  నెటిజనులు సరదగా కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. శనివారం సాయంత్రం ఖమ్మంలో జరిగిన వెంకీ మామ ఈవెంట్ లో చైతన్య ఇదిగో ఇలాంటి డిజైనర్ లుక్ లో కనిపించాడు. గతంలో ఇదే  షర్ట్ ను నాగార్జున ధరించారు. ఆ ఫోటోలు మీడియాలో  హైలైట్ అయ్యాయి. ఆ షర్ట్ డిజైన్ రొటీన్ కు భిన్నంగా ఉంది. చూపరులను ఎంతో ఆకట్టుకుంది.

సరిగ్గా అదే డిజైన్ ఉన్న షర్ట్ ను నాగచైతన్య నిన్నటి వెంకీ మామ ఈవెంట్లో ధరించడంతో ఆ ఫోటోల్ని కంపేర్ చేస్తూ.. సోషల్ మీడియాలో హైలైట్ చేస్తున్నారు అభిమానులు. నెటిజనులు సరదాగా తండ్రీ కొడుకులిద్దరు ఒకే తానులో కొనుక్కుని చొక్కాలు కుట్టంచుకున్నారా?  లేక తండ్రి షర్ట్ ను చైతూ తొడుక్కున్నాడా? అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఇక కింగ్ వారసులు ఫ్యాషన్ విషయంలో డాడ్ నే అనుసరిస్తుండడం ఆసక్తికరం.