ఫ్యాన్స్ కోసమే మన్మధుడి కష్టం

Thu Apr 18 2019 21:54:58 GMT+0530 (IST)

Nagarjuna Workouts for Manmadhudu 2 Movie

ఫిట్ నెస్ లో కింగ్ నాగార్జున తర్వాతే ఎవరైనా. 60 వయసుకు చేరువైనా ఇంకా 30వయసు నవమన్మధుడిలానే మెయింటెయిన్ చేస్తున్నారు ఆయన. నాగార్జున ఫిట్ నెస్ గురించి ప్రశంసించని వారే ఉండరు. ఫిట్ నెస్ గోల్స్ విషయంలో అక్కినేని యువహీరోలతో పాటు అభిమానులందరికీ ఆయన ఓ స్ఫూర్తి. ప్రస్తుతం నాగార్జున మన్మధుడు సీక్వెల్ (మన్మధుడు2)లో నటిస్తున్న సంగతి తెలిసిందే. రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రకుల్ ప్రీత్ కథానాయిక. సమంత ఓ కీలక పాత్ర పోషిస్తుండగా - వెన్నెల కిషోర్ కడుపుబ్బా నవ్వించే పాత్రలో నటిస్తున్నారు.ఇటీవలే చిత్రయూనిట్ ఫోర్చుగల్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఆన్ లొకేషన్ కింగ్ ఇచ్చిన సర్ ప్రైజ్ ట్రీట్ మామూలుగా లేదు. లొకేషన్ కి జిమ్ ని తీసుకెళ్లడం కుదరదు కాబట్టి.. అక్కడ ఓ అడవిలో చెట్టుకు వేలాడుతూ కసరత్తులు చేస్తున్న వైనం మైమరిపిస్తోంది. అందుకు ఓ ఫిట్ నెస్ స్ట్రెచింగ్ బెల్డ్ ని నాగార్జున ఉపయోగిస్తున్నారు. ఆన్ లొకేషన్ ఇంత డెడికేషన్ తో కింగ్ ఇలా కసరత్తులు చేస్తున్నారంటే తన పాత్ర కోసం ఎంతగా ప్రాణం పెట్టేస్తారో అర్థం చేసుకోవచ్చు. ఆరు పదుల వయసులో ఈ సాహసాన్ని మెచ్చకుండా ఉండలేం.

ఈ ఫోటోల్ని దర్శకుడు రాహుల్ రవీంద్రన్  సామాజిక మాధ్యమాల ద్వారా స్వయంగా అభిమానులకు షేర్ చేశారు. ఈ ఫోటోలకు కింగ్ ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ``దిస్ మ్యాన్ పా! ఫిట్ నెస్ గోల్స్` అంటూ నమస్కారం ఈమోజీతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు రాహుల్ రవీంద్రన్. కింగ్ ఫ్యాన్స్ ఈ ఒక్క సీన్ మాత్రం మీకోసం అంటూ ట్వీట్ చేశారు. అంటే అక్కడ ఓ భారీ యాక్షన్ సీన్ ని కూడా తెరకెక్కిస్తున్నారా? అన్నది తెలియాల్సి ఉంది. మన్మధుడు తరహాలోనే ఈ చిత్రం ఓ చక్కని రొమాంటిక్ ఎంటర్ టైనర్. సిస్టర్ సెంటిమెంట్ ఆకట్టుకుంటుందని తెలుస్తోంది. దసరా కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.