మహేష్ కోసం కింగ్ వెయిటింగ్!

Mon Sep 26 2022 12:32:54 GMT+0530 (India Standard Time)

Nagarjuna Intereted to Act with Maheshbabu

టాలీవుడ్ లో చోటు చేసుకుంటోన్న మార్పుల గురించి చెప్పాల్సిన పనిలేదు. స్టార్ హీరోలంతా ఒకే ప్రేమ్ లో కనిపించడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఒకరి సినిమాల్లో మరొకరు గెస్ట్ రోల్ పోషిస్తున్నారు. మేమంతా ఒక్కటే అన్న నినాదాన్ని ప్రపంచానికి చాటి చెబుతోన్న తరుణం ఇది. ఒకప్పటి తెలుగు సినిమా వాతావరణం వేరు. నేటి సినిమా విధానం వేరు అని ఎలుగెత్తి చాటుతున్నారు.పాన్ ఇండియాని దాటి పాన్ వరల్డ్ లో ఫేమస్ అవుతున్నారంటే?  దానికి  కారణం ఐకమత్యత అన్నది గుర్తించాల్సిన అంశం. ఇటీవలే నకింగ్ నాగార్జున సైతం  తన మనసులో మాటని బయట పెట్టిన సంగతి  తెలిసిందే.

సూపర్ స్టార్ మహేష్ బాబు రెడీ అంటే నేను రెడీ అంటూ ముందుకొచ్చేసారు. నాగార్జున  నటించిన ' ది ఘోస్ట్' ట్రైలర్ ని మహేష్ ని లాంచ్ చేసిన సందర్భంగా కింగ్ ఈ విషయాన్ని రివీల్ చేసారు.

'నా కొడుకులతో నటించాను. ఇతర హీరోలతోనూ పనిచేసాను. సూపర్ స్టార్ కృష్ణగారితో వారసుడు సినిమా చేసాను. కానీ మహేష్ తో ఇంకా నటించలేదు. అదెప్పుడు జరుగుతుం దో?నని'' చెప్పుకొచ్చారు.  'ది ఘోస్ట్' ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా  నాగార్జున స్పందిస్తూ.. మహేష్‌తో కలిసి పనిచేయడానికి తాను చాలా సిద్ధంగా ఉన్నానని.. దానికి కావాల్సిందల్లా మహేష్ నుండి ఆమోదం మాత్రమే అని  కింగ్ అన్నారు.

ఆ రకంగా  నాగార్జున మనసులో మాట బయటకు వచ్చేసింది. ఇక మహేష్ గ్రీన్ సిగ్నెల్ ఇవ్వడమే ఆలస్యం. మహేష్ ఇప్పటికే విక్టరీ వెంటేష్ తో కలిసి నటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం  పెద్ద విజయం సాధించింది. చిరంజీవి సమకాలీక హీరోల్లో మహేష్ తో తెరను పంచుకున్న ఏకైక హీరోగా వెంకీ నిలిచారు.

తాజా సన్నివేశాన్ని బట్టి  తదుపరి రేసులో  నాగార్జున కనిపిస్తున్నారు. అటుపై చిరంజీవి...బాలయ్య కూడా ఈ లిస్ట్ లో చేరినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇద్దరు ఎంతో ఓపెన్ గానే మాట్లాడే వ్యక్తులు కాబట్టి మహేష్ తో  మేము రెడీ అనడానికి పెద్దగా సమయం పట్టదు.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.