Begin typing your search above and press return to search.

నాగ్ షూ పాలిష్..ఆ ముగ్గురికి స్ట్రాంగ్ వార్నింగ్

By:  Tupaki Desk   |   15 Sep 2019 4:51 AM GMT
నాగ్ షూ పాలిష్..ఆ ముగ్గురికి స్ట్రాంగ్ వార్నింగ్
X
మనిషి చేసే పని బట్టి....స్థాయి పెరగడం...తగ్గడం ఉండదని.... ఆ మనిషి తీరు బట్టే అది ఉంటుందని కింగ్ నాగార్జున నిరూపించాడు. బిగ్‌బాస్ షో శనివారం ఎపిసోడ్‌లో నాగార్జున విశ్వరూపం చూపించారు. స్టేజ్ మీదే తన షూ పాలిష్ చేసి...ఇంటి సభ్యులకు గట్టి బుద్ధి చెప్పారు. ముఖ్యంగా మొన్న టాస్క్‌లో భాగంగా షూ పాలిష్ చేయడం ఏంటని తక్కువగా మాట్లాడిన మహేశ్ - పునర్నవిలకు కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత ఇద్దరికి గట్టి క్లాస్ పీకారు కూడా. ఎప్పుడు మోడల్స్ సాంగ్ తో ఎంట్రీ ఇచ్చే నాగ్.... స్టేజ్ మీదకి సీరియస్ గా వచ్చి..సాంగ్ వద్దు.. నేను చాలా కోపంగా ఉన్నా.. కంటెస్టెంట్స్‌ పై పీకల వరకూ ఉంది. వాళ్లతో చాలా మాట్లాడాలి అంటూ బిగ్ బాస్ హౌస్‌‌ ని మన టీవీ ద్వారా షాకింగ్ ఎంట్రీ ఇచ్చారు.

ఇక నాగ్ ని చూడగానే ఓ హడావిడి చేసిన ఇంటి సభ్యులు సీరియస్ గా ఉన్నారని తెలిసి సైలెంట్ అయిపోయారు. ఇంటి సభ్యుల్ని చూసి షాకింగ్ లుక్ ఇచ్చిన నాగార్జున.. తన షూ పాలిష్ చేసుకుంటూ క్లాస్ పీకడం మొదలుపెట్టారు. ముందుగా మహేశ్ ని లేపి మొన్న షూ పాలిష్ చేయమంటే...మేము హౌస్ లోకి ఇన్విటేషన్ మీద వచ్చాం...షూ పాలిష్ చేయడం...డ్రాయర్లు ఉతకడం ఏంటని మాట్లాడావు...ఇప్పుడు నీ ఇన్విటేషన్ క్యాన్సిల్ చేస్తున్నా... బిగ్ బాస్ డోర్లు తెరుస్తారు...వెళ్లిపోవచ్చ‌ని షాక్ ఇచ్చారు. దీంతో మహేశ్ అలా చూస్తుండిపోయాడు. కేవలం నువ్ మనసు మార్చుకుని షూ పాలిష్ చేసినందుకే ఇంటిలో ఉంచుతున్నామని చెప్పి కూర్చోబెట్టారు.

ఇక తర్వాత మొన్న టాస్క్ లో బిగ్ బాస్ ని తెగ తిట్టిన పునర్నవికి ఓ రేంజ్ లో క్లాస్ పీకారు. అసలు ని లాంగ్వేజ్ ఏంటమ్మా అంటూ ఫైర్ అయ్యారు. పునర్నవీ.. నువ్ గురువింద గింజలా ఉన్నావు.. పైనున్న ఎరుపు కనిపిస్తోంది. కిందనున్న నలుపు కనిపించడంలేదని. ఇప్పుడైనా గేమ్ ఆడు’ అంటూ సీరియస్‌ గా వార్నింగ్ ఇచ్చారు. అటు శ్రీముఖికి కూడా క్లాస్ తీసుకున్నారు. ‘నువ్ ఆడకుండా...మిగతా వాళ్ళని ఆడకుండా చేస్తున్నావని...నీ తీరు కూసే గాడిద వచ్చి...మేసే గాడిదని చెడగొట్టిన’ విధంగా ఉందని `ఇకనైనా నీ గేమ్ నువ్ ఆడు అంటూ హెచ్చరించారు.