బిగ్ బాస్ హౌస్ లో సోగ్గాడు: మంచం సరే రమ్య ఎక్కడా?

Wed Oct 09 2019 11:48:42 GMT+0530 (IST)

Nagarjuna Enters In Bigg Boss 3 House During Dhusera

బిగ్ బాస్ హౌస్ లో దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక అతిథిగా కింగ్ నాగార్జున సోగ్గాడు గెటప్ లో ఎంట్రీ ఇచ్చి ఫుల్ సందడి చేశారు. నాగార్జునను చూసి కంటెస్టెంట్స్ ఈలలు - కేకలు పెట్టేశారు. తర్వాత నాగార్జున ఇంటిలోని ప్రతి ఒక్కరినీ ప్రేమగా పలకరించారు. అలాగే నాగార్జునని నులకమంచం మీద కూర్చోబెట్టి ఇంటి సభ్యులు తాము చేసిన వంటలని రుచి చూపించారు. అయితే నులకమంచం సెటప్ చేశారు బాగానే ఉంది..కానీ నా రమ్యా ఎక్కడంటూ పంచ్ వేశారు.ఇక అంతకముందు ఇంటి సభ్యులు రెండు గ్రూపులుగా విడిపోయి వంటకాలు చేశారు. ఆ వంటకాలని సోగ్గాడుకు తినిపించారు. అలాగే చివరిలో రెండు గ్రూపులు చేసిన స్వీట్స్ ని నాగ్ టేస్ట్ చేశారు. వాటిని టేస్ట్ చేసిన నాగ్.... బాబా భాస్కర్ తయారు చేసిన స్వీట్ కంటే.. రితిక - శ్రీముఖి వాళ్లు తయారు చేసిన స్వీటే చాలా బాగుందని చెప్పారు. దాంతో బాబా భాస్కర్ ‘అదంతా స్టాటజీ సార్.. మొదట వాళ్లు పెట్టారు కాబట్టి అదే మీకు నచ్చింది సార్’ అన్నారు. దాంతో ‘నువ్వు కుకింగ్ బాగా చేస్తావని తెలుసు.. కానీ ఇవాళ మాత్రం వాళ్లదే బాగుంది’ అంటూ మన్మథుడు మహిళల టీంకే మద్దతు తెలిపారు.

అనంతరం పండుగ సందర్భంగా నాగార్జున ఇంటి సభ్యులకు స్వీట్స్ - గిఫ్ట్స్ ఇచ్చి...వారితో ముచ్చట్లు పెట్టారు. మీరంతా నాకు మంచి స్నేహితులు అయిపోయారని మీ గురించి మా ఇంట్లో కూడా తెలుసని చెప్పారు. ప్రతిరోజూ వాళ్ళకు మీ గురించి చెబుతుంటానని నాగార్జున కంటెస్టంట్స్ తో ముచ్చటించారు. అయితే కింగ్ నాగార్జున బుధవారం ఎపిసోడ్ లో కూడా సందడి చేయనున్నారు. వారితో సరదా టాస్క్ లు చేయించనున్నారు.