'బిగ్ బాస్ 3' అన్ని సందేహాలకు చెక్

Sat Jul 20 2019 20:27:59 GMT+0530 (IST)

నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభమవుతుందా లేదా? అన్నదానిపై సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది. నేడు ఉస్మానియా విద్యార్థులు హైదరాబాద్ లోని నాగార్జున ఇంటిని ముట్టడించి అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. విద్యార్థుల అరెస్టుల ఫర్వం కొనసాగింది. అయితే ఈ వివాదాలతో సంబంధం లేకుండా బిగ్ బాస్ రియాలిటీ షో ప్రారంభమవుతోందని తెలుస్తోంది.కింగ్ నాగార్జున యథావిధిగా హోస్టింగ్ కి రెడీ అవుతున్నారు. ఈ ఆదివారం 9 పీఎం బిగ్ బాస్ హౌస్ లోకి మెంబర్స్ ప్రవేశిస్తారు. వీళ్లందరికీ హోస్ట్ గ్రాండ్ వెల్ కం చెబుతారట. మరో 48 గంటల్లో షో మొదలవుతుందని కింగ్ నాగార్జున ట్విట్టర్ లో ప్రకటించిన ప్రకారమే ఇది మొదలైపోతుందట. ఇప్పటికే స్టార్ మాలో బిగ్ బాస్ 3 కి సంబంధించిన ప్రకటనలు దర్శనమిస్తున్నాయి.

ఇది బిగ్ బాస్ అభిమానులకు శుభవార్తనే. వివాదాల నడుమ ఈ షో ఉంటుందా ఉండదా? అన్న సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో ఇక `స్టార్ మా` తరపు నుంచి క్లారిటీ వచ్చేసినట్టే. రేపటి నుంచి వంద రోజుల పాటు బిగ్ బాస్ ట్రీట్ బుల్లితెర వీక్షకులకు షురూ అయినట్టేనని చెబుతున్నారు. దీంతో బిగ్ బాస్ 3 లేదన్న ప్రచారానికి చెక్ పెట్టినట్టయ్యింది.