Begin typing your search above and press return to search.

ఫెయిల్యూర్ పై డాడ్ అండ్ స‌న్ రివ్యూలు

By:  Tupaki Desk   |   15 Aug 2022 2:30 AM GMT
ఫెయిల్యూర్ పై డాడ్ అండ్ స‌న్ రివ్యూలు
X
బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో న‌టిస్తూ యువ‌హీరో నాగ‌చైత‌న్య బిజీ బిజీగా ఉన్నారు. అయితే ఇటీవ‌ల వ‌రుస ఫ్లాప్ లు అందుకోవ‌డం క‌ల‌వ‌ర‌ప‌రిచింది. అక్కినేని కాంపౌండ్ కి ఇది ఊహించ‌ని షాక్. మ‌జిలీ- ల‌వ్ స్టోరి లాంటి విజ‌యాల‌తో దూకుడు మీదున్న నాగ‌చైత‌న్య హ్యాట్రిక్ కొడ‌తాడ‌నుకుంటే వ‌రుస ఫ్లాపులెదుర‌య్యాయి.

పైగా భారీ అంచ‌నాలు పెట్టుకున్న 'థాంక్యూ' ఘోరంగా ఫెయిల‌వ్వ‌డం త‌న బాలీవుడ్ డెబ్యూ మూవీ 'లాల్ సింగ్ చ‌డ్డా'కు చెడ్డ పేరు రావ‌డం త‌ట్టుకోలేక‌పోతున్నాడు. అమీర్ లాంటి పెద్ద హీరోతో క‌లిసి హిందీలో ఘ‌న‌మైన ఎంట్రీ కి ప్లాన్ చేస్తే అది తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది. అందుకే ఇప్పుడు నాగ‌చైత‌న్య అప్ సెట్ అయ్యాడ‌ని ఈ స‌న్నివేశం నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు త‌న‌ని తాను స‌మీక్షించుకుంటున్నాడ‌ని తెలిసింది.

చైత‌న్య ప్ర‌తిసారీ సోలోగానే త‌న స్క్రిప్టులు తాను ఎంపిక చేసుకుంటాడు. అవ‌స‌రం అనుకుంటే నాగార్జున త‌న‌కు తోచిన స‌ల‌హాలు ఇస్తారు త‌ప్ప త‌న‌యుని ఎంపిక‌ల్లో త‌ల‌దూర్చ‌రు. కానీ ఇప్ప‌టి స‌న్నివేశం వేరు.

వ‌రుస ఫ్లాపులు ఎదుర‌య్యాక చ‌క్క‌దిద్దేందుకు త‌న అమూల్య‌మైన స‌ల‌హాలు ఇవ్వ‌డం త‌ప్ప‌నిస‌రి. అందుకే నాగ్ తో కూచుని చైత‌న్య‌ చాలా విష‌యాల‌పై స‌మగ్రంగా చ‌ర్చించాల‌నుకుంటున్నాడ‌ని తెలిసింది.

అసలు అతను ఎక్కడ తప్పు చేస్తున్నాడో తెలుసుకోవడానికి తన తండ్రి సీనియర్ సూపర్ హీరో నాగార్జున అక్కినేనితో కలిసి చ‌ర్చిస్తేనే బ‌య‌ట‌ప‌డ‌గ‌ల‌మ‌ని చైతూ భావిస్తున్నారట‌.

త‌దుప‌రి దూత వెబ్ సిరీస్ విక్ర‌మ్ కె తోనే చేస్తున్నాడు. అలాగే వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో కాప్ థ్రిల్ల‌ర్ కోసం రెడీ అవుతున్నాడు. అయితే ఈసారి స్క్రిప్టు ప‌రంగా ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకోవాలో కింగ్ స‌ల‌హా ఇవ్వ‌నున్నార‌ని తెలిసింది.