కోరమీసం.. గుబురు గడ్డం.. సింగం టాట్టూ .. నాగబాబేనా ఆయన?

Tue Feb 23 2021 23:00:02 GMT+0530 (IST)

Nagambabu with a mustache

సింహం బ్రాండ్ అంటే తొలిగా నటసింహా నందమూరి బాలకృష్ణను గుర్తు చేసుకుంటారు అభిమానులు. కానీ అందుకు భిన్నంగా ఇక్కడ మెగా బ్రదర్ నాగబాబు ఆ ప్లేస్ ఆక్యుపై చేస్తున్నారు. తన హ్యాండ్ బైసెప్ పై సింహం టాట్టూతో కనిపించి సర్ ప్రైజ్ చేశారు మెగా బ్రదర్. అంతేకాదు కోరమీసం తిప్పుతూ నేనే సింగం అన్నట్టుగా కనిపిస్తున్నారు. కోరమీసం గుబురు గడ్డం .. తీక్షణమైన చూపులతో కాస్త కఠినంగానే కనిపిస్తోంది వ్యవహారం.అసలింతకీ దీని అర్థం ఏమిటి? నాగబాబు ఏదో హింట్ ఇస్తున్నట్టే కనిపిస్తోంది. ఒకవేళ ఆయన మునుముందు టాలీవుడ్ లో విలన్ పాత్రల్లో చేయాలని అనుకుంటున్నారా?  తన ఇమేజ్ ని మార్చుకునే ప్రయత్నమా ఇది?  ఇటీవల అదిరింది టీవీ కార్యక్రమంతో సందడి చేస్తున్నారు. అంతకుముందు జబర్దస్త్ ని ఆయన తనదైన బ్యూటిఫుల్ స్మైల్ తోనే నడిపించగలిగారు. ఈ రెండు కార్యక్రమాల టీఆర్పీల వెనక నాగబాబు బలమైన ముద్ర ఉందని చానెల్ వాళ్లే అంగీకరిస్తారు. ఆయన జడ్జీ హోదాలో కూచుని సింపుల్ గా నవ్వేస్తుంటే కార్యక్రమం సక్సెస్సే. ఇక పార్టిసిపెంట్స్ కి క్రియేటివ్ థాట్స్ ఇవ్వడంలోనూ నాగబాబుకు ప్రత్యేకించి గుర్తింపు ఉంది. వెరసి ఆయన ఉంటే ఆ కార్యక్రమం బ్లాక్ బస్టరే అన్న ముద్ర ఉంది.

ఇక తాజాగా సోషల్ మీడియాల్లో నాగబాబు షేర్ చేసిన సీరియస్ టోన్ ఫోటోలకు ఆయన ప్రస్తుత విధి నిర్వహణకు ఏమాత్రం సంబంధం లేకపోవడమే ఆలోచింపజేస్తోంది. అయితే ఆయన తన అభిమానులకు ఏదో సంజ్ఙలు ఇస్తున్నట్టే కనిపిస్తోంది.  

మెగాస్టార్ చిరంజీవి... పవన్ కల్యాణ్ ఎప్పుడూ ఇంత సీరియస్ టోన్ ని చూపించకపోయినా నాగబాబు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. చూస్తుంటే నాగబాబు కూడా జగపతిబాబు.. సురేష్ తరహాలో విలనీ చేయాలన్న పంతంతో ఉన్నట్టే కనిపిస్తోంది. తాజాగా ఆయన లుక్ చూసి ఆ తరహా ఆఫర్లు ఇచ్చేందుకు దర్శకనిర్మాతలు ముందుకొస్తారేమో చూడాలి.-