నాగార్జున మనసులో తీరని కోరిక

Fri Sep 30 2022 08:00:01 GMT+0530 (India Standard Time)

Nagajuna movie interview comments

అక్కినేని నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమా అక్టోబర్ 5వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో ఎలాగైనా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకొని ట్రాక్ లోకి రావాలి అని నాగ్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. తప్పకుండా మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాకు ఈ సినిమా పోటీగా నిలుస్తుంది అని కామెంట్స్ అయితే వస్తున్నాయి.అయితే ప్రస్తుతం గ్యాప్ లేకుండా ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న నాగార్జున తన మనసులో ఉన్న తీరని కోరికలను కూడా బయటపెడుతున్నాడు. ముఖ్యంగా ఇప్పటివరకు దాదాపు అన్ని తరహా జానర్స్ చేసిన నాగార్జున ఆఖరికి రాజు గారి గది 2 సినిమాతో హారర్ కాన్సెప్ట్ కూడా టచ్ చేసాడు. అయితే తన కెరీర్ లో నాగార్జున ఒకే ఒక్క జానర్ మాత్రం టచ్ చేయలేదు. అదే మైథలాజికల్.

ఇప్పటివరకు నాగార్జున పెద్దగా పౌరాణిక పాత్రలో నటించిన లేదు. అన్నమయ్య తరహా రియల్ క్యారెక్టర్ లో కనిపించాడు కానీ రామాయణం మహాభారతం లాంటి కథలను ఎప్పుడూ టచ్ చేయలేదు. ఇక ఫైనల్ గా ఆ జానర్ పై స్పందిస్తూ.. అలాంటి సినిమాలు చేయాలని ఉంది అని ఎందుకంటే చిన్నప్పటినుంచి కూడా తాను పెరిగింది అదే సినిమాలతో అని నాన్నగారు ఎక్కువగా పౌరాణిక సినిమాలు చేశారని అన్నారు.

అలాగే రామారావు గారు కూడా అలాంటి సినిమాలు చేశారని ఆ సినిమాలు చూస్తూ ఎక్కువగా పెరిగాను కాబట్టి పౌరాణిక చిత్రాలను కూడా చేయాలని ఉంది అని భవిష్యత్తులో అలాంటి అవకాశం ఇస్తే తప్పకుండా చేస్తాను అని కూడా నాగార్జున వివరణ ఇచ్చాడు.

అప్పట్లో అయితే నాగార్జున ఎలాంటి పాత్ర చేసిన కూడా ప్రేక్షకులు చాలా ఈజీగా కరెక్ట్ అయిపోయేది. అన్నమయ్య సినిమా చేసి ఆ తర్వాత సూపర్ లాంటి డిఫరెన్స్ స్టైల్ సినిమా చేసిన ఘనత ఆయనకే చెల్లింది. అలాగే శ్రీరామదాసు వంటి భక్తిరస చిత్రంతో కూడా ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు థ్రిల్లర్ యాక్షన్ సినిమాగా రాబోతున్న ఘోస్ట్ సినిమాతో కూడా డిఫరెంట్ గా ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.