సుబ్బరాజును క్షమించేసిన నాగచైతన్య!

Fri Apr 19 2019 16:12:01 GMT+0530 (IST)

Nagachaitanya Majili Movie Deleted Scene

ఒక సినిమా విజయవంతం కావడానికి ముఖ్యపాత్ర పోషించే వారిలో ఎడిటర్ కూడా ఒకరు. ఒక్కోసారి వారు కొన్ని సీన్స్ విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవలిసి ఉంటుంది.  సినిమా ఫ్లో కు అడ్డుపడతాయని.. లెంగ్త్ ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో ఒక్కోసారి మంచి సీన్లకు కూడా కత్తెర వేయాల్సి ఉంటుంది. 'దేవదాస్' సినిమాలో డిలీట్ చేసిన నాని హాస్పిటల్ సీన్ అందరినీ ఎలా మెప్పించిందో అందరికీ తెలిసిందే.  అదొక్కటే కాదు చాలా సినిమల్లో అలా జరుగుతూ ఉంటుంది.  సంక్రాంతి సినిమా 'F2' నుంచి డిలీట్ చేసిన సీన్లను తర్వాత యూట్యూబ్ లో పోస్ట్ చేస్తే ప్రేక్షకులను ఎంతో మెప్పించాయి. ఇప్పుడు నాగచైతన్య సినిమా 'మజిలీ' వంతు వచ్చింది.
 
ఈ సినిమానుండి డిలీట్ చేసిన చైతు - సుబ్బరాజు మధ్యలో జరిగే సీన్ ను నిన్న 'మజిలీ' టీమ్ రిలీజ్ చేసింది. సినిమాలో మెజారిటీ భాగం ఫ్రస్ట్రేటెడ్ గా ఉన్న చైతు మారిన తర్వాత సుబ్బరాజు వద్దకు వెళ్ళి హత్తుకుంటాడు.. నెగెటివ్ ఫీలింగ్స్ గురించి చెప్తూ అవి మనకు అవసరమా అంటాడు. ఈ సీన్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లేదు... నాయిస్ ఉండడంతో వాయిస్ కూడా  క్లియర్ గా లేదు కానీ సీన్ మాత్రం టచింగ్ గా ఉంది. చైతు సుబ్బరాజు ను క్షమించినట్టు పరోక్షంగా మెసేజ్ ఇవ్వడంతో సుబ్బరాజు పాత్రకు ఒక పర్ఫెక్ట్ ఎండింగ్ ఇచ్చినట్టుగా కూడా ఉంది. ఈ సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజనులను ఆకట్టుకుంటోంది.ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాలో దాదాపు ప్రతి కీలకపాత్రకు సరైన ముగింపు ఇచ్చేలా సీన్స్  డిజైన్ చేసుకున్నాడట. కానీ నిడివి సమస్యతో వాటిని పక్కన పెట్టాల్సి వచ్చిందని టాక్.