'విశ్వాసం లేని కుక్క' వీడియో షేర్ చేసిన నాగబాబు...!

Wed Aug 05 2020 14:20:53 GMT+0530 (IST)

Nagababu sharing the story of his most adorable dog Peeku betraying him

మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటారో అందరికి తెలిసిందే. రాజకీయ సమకాలీన అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ.. కొన్ని సార్లు వివాదాస్పద ట్వీట్స్ తో విమర్శలు కూడా ఎదుర్కుంటారు. అయితే ఇటీవల నాగబాబు వ్యవహార శైలిలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఒకప్పటిలా కాకుండా చాలా సౌమ్యంగా మాట్లాడుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. ఈ క్రమంలోనే 'నా ఛానల్ నా ఇష్టం' అనే తన యూట్యూబ్ ఛానల్ పేరుని ''మన ఛానల్ మన ఇష్టం'' అని మార్చేశారు.

అప్పటి నుండి రకరకాల వీడియోలు పెట్టి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగబాబు లేటెస్టుగా తన ఇంట్లో జరిగిన ఓ ఆసక్తికర సన్నివేశాన్ని వీడియో రూపంలో ఫాలోవర్స్ తో పంచుకున్నారు. ఈ వీడియోకి ''విశ్వాసం లేని కుక్క'' అని టైటిల్ పెట్టడంతో అందరూ మెగా బ్రదర్ ఎవరినో టార్గెట్ చేసారని అనుకున్నారు. అయితే దానికి భిన్నంగా నాగబాబు ఫన్నీ వీడియోను షేర్ చేశారు.

కాగా ఈ వీడియో నాగబాబు మాట్లాడుతూ.. ''యానిమల్స్ అన్నింటిలో మనుషులతో బాగా అనుబంధంగా ఉండేవి కుక్కలు. నాకు చిన్నప్పటి నుంచి కుక్కలు అంటే ఇష్టం. మా ఇంట్లో పీకూ అనే సూపర్ బ్రీడ్ ఒకటి ఉంది. 2016 నుంచి మా ఇంట్లోనే మాతోనే ఉంటుంది. మామూలుగా ఎవరైనా ఇంటికి వచ్చినా.. నా మీదికి ఎవరైనా వచ్చినా.. సరదాగా కొట్టినట్టుగా చేసినా వాళ్లపై భయంకరంగా ఎటాక్ చేస్తుంది.. ఇన్నాళ్లు అలాంటి కలరింగ్ ఇచ్చింది. మనం ఎన్నో కుక్కల గురించి విని ఉంటాం.. యజమానిని కాపాడిన కుక్క.. యజమానిని కాపాడటంలో ప్రాణాలు కోల్పోయిన కుక్క.. ఇలా కుక్కల గురించి ఎన్నో సాహసగాధలు వినే ఉంటాం. మా పీకూ కూడా అలాంటిదే అని అనుకున్నా. అయితే మా ఆవిడకు పాములంటే భయం అనడంతో.. ఆ భయం పోగొట్టడానికి మొన్న రబ్బరు పాములు తీసుకువచ్చి.. తనతో పట్టించా'' అని చెప్తూ ఆ పాముని చూడగానే నాగబాబు భార్య పద్మతో పాటు ఆ కుక్క కూడా లోపలికి పారిపోయే క్లిప్పింగ్ చూపించాడు.''అది చూడగానే నాకు ఏం అనిపించింది అంటే.. వాడి ప్రాణాలు కాపాడాలేమో.. ఆ పాము వేడిని ఏమైనా చేస్తుందేమో అనుకోలేదు.. వీడు పోతే పోయాడు ఉంటే ఉన్నాడు.. నా జీవితం నాకు ముఖ్యం. నా ప్రాణం నాకు ముఖ్యం అనుకుని.. ఒక్క రన్ కొట్టింది అక్కడ నుంచి.. అప్పుడు అనిపించింది మా పీకూకి కూడా మనిషి లక్షణాలు బాగా వచ్చాయి. మీరు కూడా ఈ ఫన్నీ వీడియోను చూసి నవ్వు కోండి'' అంటూ నాగబాబు నవ్వేశారు.