Begin typing your search above and press return to search.

బాలయ్య అంటే నాగబాబుకు పడకపోవడానికి కారణం అదేనా...?

By:  Tupaki Desk   |   2 Jun 2020 1:00 PM GMT
బాలయ్య అంటే నాగబాబుకు పడకపోవడానికి కారణం అదేనా...?
X
రాజకీయాలలో శాశ్వత శత్రువులు శాశ్వత శత్రువులు ఉండరంటారు. అలానే చిత్ర పరిశ్రమలో కూడా అంతే. ఈరోజు తిట్టుకున్న వారు రేపు సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. లైఫ్ లో కలిసే అవకాశం లేదనుకున్నవారు కలిసి సినిమాలు తీస్తుంటారు. సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకు ఎప్పుడూ దగ్గర సంబంధాలు ఉంటూనే ఉంటాయి. అయితే రాజకీయంగా ఎంత తిట్టుకున్నా విమర్శించుకున్నా కూడా సినిమాలలో మాత్రం కలిసి చేయడం ఏవైనా ఫంక్షన్‌ లలో పాల్గొనడం చేస్తూనే ఉంటారు. ఒకవేళ వారి మధ్య గొడవలు ఉన్నా పైకి కనిపించకుండా నవ్వుతూ ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటుంటారు. అయితే మెగా బ్రదర్ నాగబాబు - నందమూరి బాలకృష్ణలు మాత్రం ఇక కలిసేలా కనిపించడం లేదంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా బాలకృష్ణ - నాగబాబు ఇష్యూ నడుస్తున్న విషయం తెలిసిందే. సినీ ఇండస్ట్రీ పెద్దలు తనని పిలవకుండా సమావేశాలు ఏర్పాటు చేసుకోవడంపై బాలకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. అయితే ఈ వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించి బాలయ్యపై ఒక వీడియో ద్వారా 'నువ్వు కింగ్ వి కాదు.. జస్ట్ హీరోవి మాత్రమే' అంటూ విరుచుకుపడ్డారు. ఇప్పుడు వీరిద్దరి వ్యాఖ్యలు ఇండస్ట్రీలో తీవ్ర దుమారాన్ని రేపాయి. అయితే వాస్తవానికి వీరిద్దరి మధ్య మాటల యుద్ధం ఇప్పుడు మొదలైంది కాదు. చాలా రోజుల క్రితమే వీరి మధ్య వార్ స్టార్ట్ అయింది.

'సెవెంత్ సెన్స్' సినిమా ఆడియో ఫంక్షన్ కి అతిథిగా హాజరైన రామ్ చరణ్ మాట్లాడుతూ మురగదాస్ లాంటి డైరెక్టర్ మన తెలుగు చిత్ర పరిశ్రమలో పుట్టనందుకు మన బ్యాడ్ లక్ అనే మీనింగ్ లో మాట్లాడాడని దానిపై బాలయ్య ఇండైరెక్ట్ గా చరణ్ పై ఫైర్ అయ్యారు. ఆ తర్వాత బాలయ్య వ్యాఖ్యలపై స్పందించిన చిరంజీవి 'బాలయ్యది చిన్న పిల్లల మనస్తత్వం.. నాకు బాలయ్య మాటలు చేతలు చిన్నపిల్లాడిని గుర్తు చేస్తాయి' అంటూ నవ్వుతు కౌంటర్ వేశారు. అప్పటి నుండి తరచూ వీరి అభిమానుల మధ్య ఈ విషయంలో వార్ జరుగుతూనే వస్తోంది. ఇక రెండు ఫ్యామిలీలు రాజకీయాల్లోకి వచ్చాక ఒకరిమీద ఒకరు తొడలు కొట్టుకోవడం.. మీసం తిప్పడం.. జరుగుతూ వచ్చాయి. అయితే ఈ వ్యవహారంలోకి మెగా బ్రదర్ నాగబాబు ఎంటర్ అయిన తర్వాత సీన్ మారిపోయింది. అప్పటి దాకా ఫ్యాన్స్ వార్ గా ఉండేది డైరెక్ట్ ఒకరిమీద ఒకరు పర్సనల్ గా కామెంట్ చేసుకునే వరకు వచ్చింది. 'ప్రజారాజ్యం' 'టీడీపీ' ఎన్నికల ప్రచారాలలో విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ వచ్చారు.

అంతేకాకుండా బాలకృష్ణ ఎవరో తనకు తెలియదంటూ అప్పట్లో నాగబాబు వరుసగా బాలయ్యను టార్గెట్ చేసుకుంటూ వచ్చారు. ఆ తరువాత బాలకృష్ణ అనే పాతతరం కమెడియన్ ఫోటో చూపించి ఓ సారి.. ఆ తర్వాత కొన్ని జంతవుల ఫోటోలు పెట్టి ఓ సారి.. అలాగే బయోపిక్‌ పై ఓ కవిత రాసి… బాలకృష్ణపై తన కోపాన్నంతా చూపించాడు. నాగబాబు హఠాత్తుగా అప్పటికి రెండేళ్ల క్రితం 'పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదు' అన్న బాలయ్య మాటలకి ఇప్పుడు ఎందుకు బాలకృష్ణను టార్గెట్ చేసారో ఎవరికీ అర్థం కాలేదు. అయితే పొలిటికల్‌ గా మాత్రం టీడీపీకి.. జనసేనకు మధ్య ఈ మాటలు హీట్‌ ను పెంచాయి. నిజంగా బాలకృష్ణ మాటలు మనసుల్ని బాధపెట్టి ఉంటే అప్పుడే ఎందుకు రియాక్ట్ అవలేదు.. ఇప్పుడు బాలకృష్ణ అభిమానులను రెచ్చగొట్టే వ్యూహంతోనే ఈ వ్యాఖ్యలు చేసారని రాజకీయ విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేసారు.

ఆ తర్వాత కూడా బాలయ్య రెగ్యులర్ గా మాట్లాడే మాటలైన 'బ్లడ్డు.. బ్రీడ్' గురించి కూడా నాగబాబు మాట్లాడారు. ఓ దున్నపోతు ఫోటో.. ఓ కుక్క బొమ్మ పెట్టి 'వీటి బ్లడ్డు బ్రీడు చాలా స్పెషల్' అంటూ కవ్వించే ప్రయత్నం చేసాడు. ఇలా వరుసగా బాలయ్య సైలెంటుగా ఉంటున్నా నాగబాబు పరోక్ష కామెంట్స్ చేయడం వెనుక రీజన్ ఏంటి అనే విషయంపై అప్పట్లో తీవ్ర చర్చ నడిచింది. నందమూరి మెగా ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. ఆ తర్వాత రోజుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ కి సపోర్ట్ చేయడంతో నాగబాబు చాలా రోజుల నుండి సైలెంటుగా వస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దలపై బాలయ్య వ్యాఖ్యలతో మరోసారి నాగబాబు తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డాడు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ వరుసగా ట్వీట్లు చేస్తూ వచ్చాడు. తదుపరి ఎన్నికల తర్వాత వైసీపీ, జనసేన, బీజేపీలలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో కాలమే నిర్ణయిస్తుందని.. అయితే టీడీపీ మాత్రం కచ్చితంగా అధికారంలోకి రాదనేది తన నమ్మకమంటూ విమర్శలు గుప్పించారు.

ఇప్పుడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో నాగబాబుకు మీకు గొడవ జరిగిందిగా.. నాగబాబు వ్యాఖ్యలపై మీరేమంటారు? అని ప్రశ్నించగా "ఛీ ఛీ... నేనేమంటాను.. అన్నీ ఆయనే మాట్లాడుతున్నాడు కదా. నేను అస్సలు స్పందించను. ఇవాళ ఇండస్ట్రీ మొత్తం నాకు సపోర్ట్ గా నిలుస్తోంది. అలాంటప్పుడు నేనెందుకు మాట్లాడాలి?" అంటూ బాలకృష్ణ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. దీంతో మెగా నందమూరి ఫ్యాన్స్ మరోసారి సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేసుకుంటున్నారు. మరి బాలయ్య వర్సెస్ నాగబాబు ఇష్యూ సినీ ఇండస్ట్రీలో ఇంకా ఎంతకాలం కొనసాగుతుంతో.. ఫుల్ స్టాప్ పడుతుందో లేదో అంటూ అని సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు.