నాగబాబు షో రేటింగ్ అదిరిందా? లేదా?

Tue Jan 14 2020 09:59:22 GMT+0530 (IST)

Nagababu Show Rating Is Not Up To The Mark

ఈటీవీలో సుదీర్ఘ కాలంగా ప్రసారం అవుతున్న జబర్దస్త్ నుండి నాగబాబు బయటకు వచ్చేసి అదిరింది అనే కొత్త కామెడీ షో ద్వారా జీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. జబర్దస్త్ కు కాపీ పేస్ట్ లా అదిరింది షో కాన్సెప్ట్ ఉంది. దాంతో ఖచ్చితంగా జబర్దస్త్ స్థాయిలో ఈ షో కూడా అదిరిపోవడం ఖాయం అంటూ నాగబాబు మరియు టీం అనుకున్నారు. కాని ఫలితం తారు మారు అయ్యింది. గతంలో జబర్దస్త్ కు పోటీగా ఎన్నో కామెడీ షోలు వచ్చాయి. అవి అన్ని కూడా జబర్దస్త్ ముందు నిలువలేక పోయాయి. ఇప్పుడు అదిరింది కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటుంది.జబర్దస్త్ కామెడీ షో వారంలో రెండు రోజులు ప్రసారం అవుతుంది. ఆ రెండు రోజులు కూడా భారీ టీఆర్పీ రేటింగ్ ను దక్కించుకుంటుంది. అదిరింది ప్రారంభం అవ్వడంతో జబర్దస్త్ కామెడీ షో రేటింగ్ తగ్గే అవకాశాలు ఉన్నాయంటూ ఆమద్య కొందరు అనుకున్నారు. కాని తాజాగా విడుదలైన రేటింగ్స్ ను చూస్తుంటే జబర్దస్త్ ను అదిరింది కూడా ఏమాత్రం కదిలించలేక పోతుందని అనిపిస్తుంది. భవిష్యత్తులో కూడా జబర్దస్త్ ను అదిరింది బీట్ చేసే అవకాశాలు కనిపించడం లేదు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అదిరింది కామెడీ షోలో ఉన్న కమెడియన్స్ అంతా కూడా ఔట్ డేటెడ్ అంటూ మొదటి నుండి కామెంట్స్ వచ్చాయి. దాంతో షో ను ప్రేక్షకులు ఎక్కువగా ఆధరించడం లేదు. పైగా ఈ కామెడీ షో ప్రసారం అయ్యేది ఆదివారం అవ్వడంతో ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపడం లేదు కొందరు విశ్లేషిస్తున్నారు. తాజా టీఆర్పీ రేటింగ్స్ లో అదిరిందికి కేవలం 2.26 మాత్రమే దక్కింది. ఇది జబర్దస్త్ మరియు ఎక్స్ ట్రా జబర్దస్త్ కు వచ్చే రేటింగ్స్ లో సగం కూడా లేదు.

గత వారం జబర్దస్త్ కు 6.5 రేటింగ్ వచ్చింది. రేటింగ్ ప్రకారం అయినా యూట్యూబ్ లో వ్యూస్ ప్రకారం అయినా అదిరింది ఇంకా అదరగొట్టలేక పోతుందని కామెంట్స్ వస్తున్నాయి. నాగబాబు తప్పు చేశాడా అంటూ కొందరు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.