ఆ మ్యాజిక్ రీ క్రియేట్ చేయడం అసాధ్యం

Sun Nov 17 2019 23:00:01 GMT+0530 (IST)

Nagababu On about Jabardasth Show

తెలుగు బుల్లి తెరపై ఎప్పటికి చెరిగిపోని ముద్ర వేసిన కామెడీ షో జబర్దస్త్. గత కొన్ని రోజులుగా ఈ షో గురించి మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. జబర్దస్త్ షోకు నాగబాబుతో పాటు మరికొందరు కమెడియన్స్ గుడ్ బై చెప్పారట. నాగబాబు స్థానం కోసం మల్లెమాల వారు ప్రస్తుతం కొందరు సినీ ప్రముఖులను పరిశీలిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఆ జాబిత చాలా పెద్దగానే ఉంది. బండ్ల గణేష్.. అలీ.. పృథ్వీ.. సాయి కుమార్ ఇంకా నటులు మరియు దర్శకులను కూడా జబర్దస్త్ జడ్జ్ సీటు కోసం పరిశీలించారంటా.ప్రస్తుతానికి మల్లెమాల వారు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని త్వరలోనే నాగబాబు స్థానంను భర్తీ చేసేందుకు తీవ్రంగా కసరత్తు అయితే జరుగుతుందని అంటున్నారు. జనాలు నాగబాబుకు అలవాటు పడిపోయి మరెవ్వరు వచ్చినా కూడా ఆధరించే పరిస్థితి కనిపించడం లేదు. నాగబాబు అందుబాటులో లేని సమయంలో ఎవరైనా గెస్ట్ లు వస్తేనే ఆ వారం అంతా కూడా షో గురించి బాడ్ టాక్ నడవడం లేదంటే ప్రేక్షకులు ఆసక్తి చూపించక పోవడం జరుగుతుంది. అందుకే కొత్తగా ఎవరైనా జడ్జ్ లు వస్తే ఆ మ్యాజిక్ రీ క్రియేట్ చేయడం అసాధ్యం అంటూ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

జబర్దస్త్ నుండి వెళ్లే వారితో జీ తెలుగు ఒక కామెడీ షోను ప్లాన్ చేస్తోంది. ఆ కామెడీ షోను కూడా జబర్దస్త్ వచ్చే టైం లోనే ప్రసారం చేసే అవకాశం ఉంది. కనుక జబర్దస్త్ షో రేటింగ్ భారీగా తగ్గడం కన్ఫర్మ్ అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కమెడియన్స్ మారినా ప్రేక్షకులు కనెక్ట్ అయ్యి చూశారు. కాని ఈసారి కమెడియన్స్ తో పాటు జడ్జ్ లు కూడా మారబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభావం ఉంటుందేమో అంటూ నెటిజన్స్ చాలా బలంగా అనుకుంటున్నారు. మరి కొన్ని రోజుల్లో లేదా మరికొన్ని వారాల్లో తెలుగు బుల్లి తెరపై ఏదో ఒక పెద్ద మార్పు అయితే జరగడం కన్ఫర్మ్ అనేది క్లీయర్ గా కనిపిస్తుంది.