ఆ పుకార్లు బాధ పెట్టాయన్న నాగచైతన్య

Thu Sep 23 2021 19:00:01 GMT+0530 (IST)

NagaChaitanya opening up on rumors

ప్రస్తుతం లవ్ స్టోరి రిలీజ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న నాగచైతన్యకు విడాకుల ప్రచారంపై కనీసం ఒక ప్రశ్న అయినా ఎదురవుతూనే ఉంది.  ఓ ప్రశ్నకు సమాధానంగా చైతన్య మాట్లాడుతూ.. ``నేను పెరిగే క్రమంలో నా తల్లిదండ్రుల నుండి చాలా నేర్చుకున్నాను. వారిని ఇంటికి వచ్చినపుడే నేను ఎప్పుడూ గమనించేవాడిని. ఇంటిదగ్గర ఎప్పుడూ వృత్తి గురించి మాట్లాడరు. వృత్తిలో ఉన్నప్పుడు వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లరు. దీనిని వారు చక్కగా బ్యాలెన్స్ చేసేవారు. దీనిని నేను ఎప్పుడూ గమనించాను. నేను కూడా వృత్తిగత జీవితాన్ని వ్యక్తిగత జీవితాన్ని విడివిడిగా చూస్తాను`` అని అన్నారు.తాజా పుకార్లపై స్పందిస్తూ.. ``ఇది కొంత బాధాకరమైనది`` అని అన్నారు. గాసిప్స్ కోసం తన పేరును వాడుకోవడం కొంత బాధగా అనిపించిందని హీరో నాగచైతన్య అన్నారు. ప్రతి ఒక్కరికీ వృత్తిపరమైన.. వ్యక్తిగత జీవితాలు ఉంటాయని అన్నారు. ఆ రెండింటినీ తాను వేర్వేరుగానే చూస్తానని తెలిపారు. నటుడిగా కెరీర్ ప్రారంభించిన సమయంలోనే వ్యక్తిగత వృత్తిగత జీవితాలను వేర్వేరుగా చూడడం నేర్చుకున్నాను. ఆ రెండింటీని కలిపి చూడను. ఈ విషయాన్ని మా తల్లిదండ్రుల నుంచి తెలుసుకున్నాను.. అని తెలిపారు.

తనపై వస్తున్న వాటిని చూసి కొంత బాధపడ్డానని ఒకానొక సమయంలో అసత్య వార్తలు వచ్చాయని చైతన్య అన్నారు. ఇలాంటి వార్తలు ఎలా రాస్తారు ? అనుకున్నా. పాత రోజుల్లో మ్యాగజైన్స్ ఉండేవి. నెలకో మ్యాగజైన్ వచ్చేది. దానివలన ఒక నెలంతా అదే వార్త వినిపిస్తుండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి.. అని అన్నారు. ఒక వార్త వెంటే మరో వార్త రీప్లేస్ చేస్తుంటాయి. కానీ వాటిలో నిజాలు మాత్రమే ప్రజలకు గుర్తుంటాయని అర్థమైనప్పటి నుంచి నేను వాటి గురించి పట్టించుకోవడం లేదు.. అని చైతన్య అన్నారు. ``TRP లను సృష్టించడానికి ఉపయోగించే వార్తలను మర్చిపోతారు`` అని అన్నారు.

కొన్ని సంవత్సరాల పాటు డేటింగ్ చేసిన తర్వాత 2017 లో సమంత రూత్ ప్రభు -నాగ చైతన్య వివాహం చేసుకున్నారు. మూడేళ్లకు మనస్ఫర్థలు అంటూ ప్రచారం సాగుతోంది. ఇక చైతన్య .. సమంత ఎవరికి వారు కెరీర్ పరంగా పూర్తి బిజీగా ఉన్నారు. సమంత తదుపరి కథువాకుల రెండు కాదల్- శాకుంతలం చిత్రాల్లో కనిపించనున్నారు. నాగ చైతన్య `లవ్ స్టోరీ` శుక్రవారం విడుదలైంది. లవ్ స్టోరీ రేపు (సెప్టెంబర్ 24) విడుదలవుతుంది. ఇప్పటికే ఈ చిత్రం ట్రెయిలర్.. పాటలతో క్యూరియాసిటీని పెంచింది. ఈ సినిమా విజయంపై చైతన్య - కమ్ముల బృందం ధీమాను వ్యక్తం చేస్తున్నారు.