Begin typing your search above and press return to search.

తమ్ముడి హీరోయిన్ తో అన్నయ్య!

By:  Tupaki Desk   |   29 May 2022 2:30 AM GMT
తమ్ముడి హీరోయిన్ తో అన్నయ్య!
X
సినిమా ప్రపంచంలో ఓకే ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలతో కలిసి నటించేందుకు నేటితరం బ్యూటీలు ఎంతగానో ఆసక్తిని చూపిస్తున్నారు. యాదృచ్చికంగా జరుగుతుందో లేక హీరోయిన్స్ సంఖ్య తక్కువ కావడం వల్లనో తెలియదు గాని అక్కినేని కాంపౌండ్ లో మాత్రం హీరోయిన్స్ కు అలాంటి ఛాన్స్ లు ఎక్కువగా వస్తున్నాయి. ఇంతకుముందు అల్లు అర్జున్, రామ్ చరణ్ లతో కాజల్ అగర్వాల్, తమన్నా స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే.

నాగచైతన్యతో ఇదివరకే నిధి అగర్వాల్ సవ్యసాచి సినిమా చేయగా తమ్ముడు అఖిల్ మిస్టర్ మజ్ను అనే సినిమా చేశాడు. అంతకుముందు బుట్టబొమ్మ పూజా హెగ్డే తో కూడా ఒక లైలా కోసం అనే సినిమా చేశాడు నాగచైతన్య. ఇక ఇటీవల అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమా చేసి హిట్ కొట్టాడు.

ఇక అదే తరహాలో ఇప్పుడు మరోసారి ఇద్దరు బ్రదర్స్ మరో హీరోయిన్ తో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు రెడీ అయ్యారు. అఖిల్ ఏజెంట్ సినిమాలో నటిస్తున్న సాక్షి వైద్య త్వరలోనే నాగచైతన్య తో మరో సినిమాను స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

చైతు థాంక్యూ అనంతరం స్టార్ట్ చేయనున్న మరో ప్రాజెక్ట్ లో ఈ బ్యూటీ హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్ట్ చేయనున్న ఆ సినిమాలో పెళ్లి సందడి బ్యూటీ శ్రీలీల కూడా నటించే అవకాశం ఉన్నట్లు ఆ మధ్య టాక్ వచ్చింది.

కానీ ప్రస్తుతం చిత్ర యూనిట్ సభ్యులు సాక్షి కోసం సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. సాక్షి ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకునేందుకు ప్రయత్నం చేస్తోంది.

సోషల్ మీడియాలో మోడల్ గా మంచి క్రేజ్ అందుకున్న ఈ బ్యూటీ టెలివిజన్ కమర్షియల్ యాడ్స్ లో కూడా నటించింది. ఇక ఇదివరకే తెలుగులో కొన్ని ఆఫర్స్ వచ్చినప్పటికీ ఒప్పుకోలేదు. అఖిల్ ఏజెంట్ ఆఫర్ రాగానే నమ్మకంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.