Begin typing your search above and press return to search.

మా నాన్నని అలా ఎప్పుడూ చూడలేదు: చైతూ

By:  Tupaki Desk   |   26 Sep 2022 3:35 AM GMT
మా నాన్నని అలా ఎప్పుడూ చూడలేదు: చైతూ
X
ఒక వైపున నాగార్జున .. మరో వైపున చైతూ - అఖిల్ ఇద్దరూ కూడా ఎవరికి వారు తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ ముగ్గురిని మళ్లీ తెరపై చూడాలని అభిమానులు ముచ్చట పడుతుండగా, అంతకంటే ముందుగానే 'ది ఘోస్ట్' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముగ్గురూ సందడి చేశారు. నాగార్జున - ప్రవీణ్ సత్తారు కాంబినేషన్లో ఈ సినిమా రూపొందింది. మార్క్ కె రాబిన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, దసరా కానుకగా అక్టోబర్ 5వ తీదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా కర్నూల్ వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకుంది.

ఈ స్టేజ్ పై చైతూ మాట్లాడుతూ .. "ఫస్టు టైమ్ కర్నూల్ రావడం .. అది కూడా నాన్నతో .. అఖిల్ తో కలిసి రావడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. సాధారణంగా ఒక మాస్ సినిమా వస్తుందంటే సౌండ్ ఎలా ఉంటుందనేది మాకు హైదరాబాద్ లో తెలుస్తుంది.

అలాంటి సౌండ్ ను ఈ సినిమా విషయంలో ఇక్కడే టేస్టు చేస్తున్నాము. కర్నూల్ లోని వాళ్లంతా ఈ స్థాయిలో సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారంలో ఒక మూడు నాలుగు సార్లైనా నేను నాన్నను కలుస్తూ ఉంటాను. ఆయన తన వర్క్ కి సంబంధించి కొంతసేపు మాట్లాడతారు.

కానీ గత నాలుగైదు నెలలుగా నాన్నను ఎప్పుడు కలిసినా ఆయన ఈ సినిమాను గురించే మాట్లాడారు. ఇంతటి ఎగ్జైట్ మెంట్ ను నేను ఈ మధ్య కాలంలో నాన్నలో చూడలేదు. నేను కూడా మీలాగే టీజర్ .. ట్రైలర్ .. సాంగ్స్ చూశాను. సినిమాను చూడలేదు. కానీ కంటెంట్ చూసి షాక్ అయ్యాను. 'బంగార్రాజు' నుంచి నాన్న 'ఘోస్ట్' గా మారిన తీరు నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ విషయంలో నేను మా నాన్నని స్ఫూర్తిగా తీసుకుంటున్నాను.

ఇక దర్శకుడిగా ప్రవీణ్ విషయానికి వస్తే నాన్నను నేను ఎలా చూడాలని నేను అనుకున్నానో అలాగే చూపించాడు. స్టైలీష్ యాక్షన్ సినిమాలో నాన్న చాలా బాగా చేశారు. ఉన్న రీసోర్స్ తోనే మాగ్జిమమ్ అవుట్ పుట్ ఇవ్వడమే ప్రవీణ్ ప్రత్యేకత.

ప్రతి అప్ డేట్ ను ఆయన ఒక ప్లానింగ్ తో వదలడం నాకు నచ్చింది. అక్టోబర్ 5న నాకు తెలిసి కర్నూల్ లో స్క్రీన్లు చిరిగిపోతాయ్. ఆ తరువాత తమ్ముడు వచ్చి 'ఏజెంట్' తో థియేటర్లను బద్దలు కొట్టేస్తాడు. ఇక అభిమానులందరికీ పండుగ రోజులు మొదలైనట్టే" అంటూ చెప్పుకొచ్చాడు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.