Begin typing your search above and press return to search.

ప్రభాస్ మూవీ ఎక్స్-లైఫ్ తో సంబంధం లేనిది

By:  Tupaki Desk   |   28 Feb 2021 12:45 PM GMT
ప్రభాస్ మూవీ ఎక్స్-లైఫ్ తో సంబంధం లేనిది
X
బ్యాక్ టు బ్యాక్ సినిమాల్ని ప్ర‌క‌టించి ప్ర‌భాస్ ఈ లాక్ డౌన్ లో షాక్ ల మీద షాక్ లిచ్చాడు. రాధేశ్యామ్ రిలీజ్ కి ముందే వ‌రుస‌గా మూడు సినిమాల్ని ప్ర‌క‌టించాడు. వీటిలో నాగ్ అశ్విన్ - అశ్వ‌నిద‌త్ కాంబినేష‌న్ మూవీని అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భావించి లాంచింగ్ కూడా చేశారు.

ప్ర‌స్తుతం ఈ మూవీ ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. దర్శకుడు తాజా ఇంటర్వ్యూలో ఒక ఆస‌క్తిక‌ర విష‌యం తెలిపారు. జూన్-జూలై నుండి షూటింగ్ ప్రారంభించనున్నామ‌ని ప్ర‌భాస్ అభిమానుల చెవిన వేశారు. ఇది సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్ మూవీ.. అని తెలిపారు.

ఇటీవలి నెట్‌ఫ్లిక్స్ సంకలనం `పిట్ట‌ కథలు`లో ఎక్స్ లైఫ్ ఎపిసోడ్ కి నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే ప్రభాస్ తో త‌దుప‌రి చిత్రం వర్చువల్ రియాలిటీ నేప‌థ్యంలో ఎక్స్-లైఫ్ స్టోరి అని ఊహించారు చాలామంది. కానీ అది నిజం కాద‌ని నాగ్ అశ్విన్ తాజాగా వెల్ల‌డించారు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్ల‌ర్ కేట‌గిరీ మూవీ కాబట్టి ఈ చిత్రం కోసం మెంటర్ ‌గా నాగ్ అశ్విన్ కు సహాయం చేయడానికి ప్రముఖ వెట‌రన్ ద‌ర్వ‌క‌దిగ్గ‌జం సింగీతం శ్రీనివాస్ ఈ టీమ్ తో చేరారు. ఇక‌ పిట్ట‌క‌థ‌లు ఓటీటీలో వ‌రుస సినిమాల వెల్లువ వ‌ల్ల అంత‌గా ఆద‌ర‌ణ పొంద‌ని సంగ‌తి తెలిసిన‌దే. తాజాగా ప్ర‌భాస్ న‌టిస్తున్న మ‌రో క్రేజీ పాన్ ఇండియా మూవీ స‌లార్ ఈ వేస‌విలో రిలీజ్ కానుంద‌ని ఏప్రిల్ 14 డేగ్ ఫిక్స్ చేశామ‌ని ప్ర‌శాంత్ నీల్ బృందం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.