పోస్టర్ టాక్: ఆద్యంతం ఆకట్టుకుంటున్న వరుడు కావలెను..!

Wed Apr 21 2021 13:00:01 GMT+0530 (IST)

Naga shourya Varudu kavalenu poster talk

తెలుగు ప్రేక్షకులు పండుగలు జరుపుకోవడానికి ఎంతగా ఇంపార్టెన్స్ ఇస్తారో.. తెలుగు ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలపడానికి కూడా టాలీవుడ్ సెలబ్రిటీలు అంతే ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. కానీ సినిమా వాళ్లు కదా సోషల్ మీడియా అనే ప్లాట్ ఫామ్ ఉపయోగిస్తారు. ఈరోజు శ్రీరామనవమి సందర్బంగా టాలీవుడ్ మేకర్స్ ఒక్కొక్కరుగా వారి సినిమా నుండి నూతన పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఈ జాబితాలో తాజాగా యంగ్ హీరో నాగశౌర్య సినిమా కూడా చేరింది. ప్రస్తుతం ఈ యువహీరో చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఓవైపు లక్ష్య సినిమా చేస్తూనే మరోవైపు 'వరుడు కావలెను' అనే రొమాంటిక్ కామెడీ మూవీ చేస్తున్నాడు.ఆ సినిమా నుండి తాజాగా శ్రీరామనవమి సందర్బంగా న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమా టైటిల్ తోనే సోషల్ మీడియాలో మంచి క్రియేట్ చేసుకుంది. వరుడు కావలెను అనే డిఫరెంట్ టైటిల్ తో ఈ సినిమా పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లో శ్రీరామనవమి శుభాకాంక్షలతో పాటు హీరో నాగశౌర్య అలా గోడపై కూర్చున్నట్లు కనిపిస్తుంది. బాక్గ్రౌండ్ లో శ్రీరాముడు - సీతాదేవిల కళ్యాణం జరుగుతున్న పోస్టర్ చూస్తే సినిమా నేపథ్యం ఏమిటో అర్ధమవుతుంది. ఈ పోస్టర్ లో హీరో నాగశౌర్య చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. లేడీ డైరెక్టర్ లక్ష్మి సౌజన్య ఈ సినిమాతో దర్శకురాలిగా డెబ్యూ చేయనుండగా.. రితూవర్మ హీరోయిన్ గా నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.