గుండెను తాకేలా చై థాంక్స్ నోట్

Wed Jul 06 2022 20:11:46 GMT+0530 (IST)

Naga chaitanya Thank you movie letter

నాగ చైతన్య - రాశి ఖన్నా జంటగా నటించిన చిత్రం థ్యాంక్యూ. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించారు. త్వరలోనే మూవీ విడుదల కానుంది. మేకర్స్ ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించారు. అందులో భాగంగా ఇప్పటికే ఈ ఆల్బమ్ లోని మూడు పాటలను చిత్రబృందం విడుదల చేయగా శ్రోతల్లోకి దూసుకెళ్లాయి.మేకర్స్ ఇటీవల ఇంటర్వ్యూలతో ప్రమోషన్ లో వేగం పెంచారు. ముఖ్యంగా ప్రధాన జంట మీడియా చిట్ చాట్ లతో చాలా బిజీగా ఉన్నారు. సినిమా టైటిల్ లో చెప్పినట్లుగా మన జీవితాన్ని సులభతరం చేసిన.. కష్ట సమయాల్లో మాకు సహాయం చేసిన.. మా విజయానికి బాటలు వేసిన వారికి మనం కృతజ్ఞతలు చెప్పాలి.

యువ కథానాయకుడు నాగ చైతన్య కచ్చితంగా ఆ పని చేసాడు. ముందుగా తన తల్లి గారైన లక్ష్మికి ఇన్ స్టాగ్రామ్ లో హృదయపూర్వక కృతజ్ఞతా పత్రాన్ని పోస్ట్ చేసాడు.

ఎప్పటికప్పుడు తనను తాను నిర్మించుకుంటూ పాతుకుపోయినందుకు సాధ్యమైన విధంగా షరతులు లేకుండా ఉన్నాడు. తనను సరైన మార్గంలో నడిపించినందుకు ఒక స్నేహితుడిగా ఉన్నందుకు తన తండ్రి అక్కినేని నాగార్జునకు కృతజ్ఞతలు తెలిపారు.

ఎవరికి ఎవరు ఎందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారో పంచుకోవడానికి #themagicwordisthankyou అనే హ్యాష్ ట్యాగ్ ను ఉపయోగించాలని అతను ప్రతి ఒక్కరినీ అభ్యర్థించాడు. ఈ అద్భుతమైన హ్యాష్ ట్యాగ్ ఇప్పటికే ట్రెండింగ్ లో ఉంది. నాగ చైతన్య నుండి వచ్చిన ఈ లవ్లీ నోట్ మరెన్నో కృతజ్ఞతతో కూడిన కథలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా తెస్తుందనడంలో సందేహం లేదు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జూలై 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. మాళవిక నాయర్- అవికా గోర్ -సాయి సుశాంత్ రెడ్డి తదితరులు ఈ చిత్రంలో ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి రచన: BVS రవి .. దర్శకత్వం: విక్రమ్ K కుమార్.